వెలకట్టలేని బంధాలను, వదులుకోలేని అనుబంధాలను గుర్తుచేసే మధుర బంధమే *రక్షాబంధనం*”

 వైస్ ఎంపీపీ గురుమిట్కల మల్లేశం
దోమ జనం సాక్షి.
75 వ స్వతంత్ర భారత్ వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వైస్ ఎంపీపీ గురుమిట్ కల మల్లేశం అధ్యక్షతన ఏర్పాటు చేసిన *జాతీయ సమైక్యత రక్షాబంధన్*కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నాచెల్లెళ్ల అనురాగ బంధానికి అక్క తమ్ముళ్ల ఆప్యాయ బంధానికి ప్రతీక ఈ రక్షాబంధన్ నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మనందరం కలిసి దేశానికి రక్ష గా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు సమితి అధ్యక్షులు బోయని లక్ష్మయ్య, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కొసనం జ్యోతి, ఎంపీటీసీ అనిత, ఏపిఎం జంగయ్య, దోమ ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్, రాఘవేందర్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి సోమలింగం, యాదయ్య గౌడ్, సీసీలు నారాయణ, లక్ష్మారెడ్డి, నర్సింలు, సుజ్ఞాని, అంజమ్మ, వివో ఏలు, ఎంఎస్ ఓబిలు తదితరులు పాల్గొన్నారు.