వెలుగులు విరజిమ్మిన మన తెలుగు
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భాషన్నా, యాసన్నా ఈసడించుకున్న వారే తెలంగాణ భాషా వైదుష్యాన్ని వేనోళ్ల కొనియాడిన ఘట్టం ఆవిష్కృతం కావడం నిజంగా తెలంగాణ గడ్డ చేసుకున్న పుణ్యం. భాషకు, మాండలికాలకు ఫలానా అన్న నిబంధనలు లేనప్పటికీ తెలంగాణ భాష అర్థశతాబ్దం పాటు అణచివేతకు గురయ్యింది. అంతేనా అంటే చులకనకు గురయ్యింది. తెలంగాణ మాట్లాడే వాడిని చూస్తే ఈసడించుకున్న రోజు లేదు. సినిమాల్లో అయితే తెలంగాణ యాసను అసహ్యించుకునేలా వాడుకున్నారు. అవేనోళ్లు ఇవాళ మహాసభలు వేదికగా అదర¬ అంటూ చప్పట్లు చరిపించాయి. మనగడ్డపైనే మన తెలంగాణ భాషకు ఇప్పుడు రాజసం రావడం నిజంగా ప్రపంచ తెలుగు మహాసభల పుణ్యమేనని చెప్పాలి. ఆనాడెప్పుడో అష్టదిగ్గజాలతో శ్రీకృష్ణదేవరాయలు భాషా వైదుష్యాన్ని పండించారని చదువుకున్నాం. కానీ ఈనాడు తెలంగాణ ప్రభువు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అంతకు వెయ్యింతలు తెలుగు భాష అభివృద్దికి తీసుకుంటున్న చర్యలు కళ్లారా చూశాం. అలాంటి సౌభాగ్యం మన భాగ్యనగర వేదికగా సాగిన ఐదురోజుల ముచ్చట తీర్చింది. ఈ సభల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వారు.. పరోక్షంగా టీవీల ద్వారా వీక్షించిన వారు, వార్తల ద్వారా చదివి తెలుసుకున్న వారు..వార్తలు చెబితే విన్నవారంతా ముక్తకంఠంతో అ¬..అదర¬ అన్న నినాదాలే వినిపించాయి. ఇంతటి భాగ్యం తెలుగుకు గతంలో ఏనాడు వచ్చివుండదు. అందుకే ప్రపంచ తెలుగుమహాసభలు ఐదురోజుల పాటు జరిగితే ఐదుక్షణాల్లో ముగిసాయన్న ఆనందం కలిగింది. అప్పుడే సభలు అయిపోయాయా అని అంతా బాధపడ్డారు. మరో రోజు సభలు ఉంటే బాగుండేదని అనుకున్నారు. అంతేనా అంటే .. భాషకు ఎల్లలు లేవన్న రీతిలో సభలు సాగాయి. ప్రాంతీయ భేధాలు లేకుండా అందరికీ సముచిత గౌరవం దక్కింది. తెలుగు..తెలుగే అన్న రీతిలో సభలు సాగాయి. ఇంతటి మాధుర్యాన్ని కలిగించిన తెలుగువల్లభుడు సిఎం కెసిఆర్ చరిత్రలో చిరస్థాయిగా వెలుగొందుతారు. ఆయన దీక్షాదక్షతలకు ఈసభలు మచ్చుతునక మాత్రమే. అంతేనా అంటే తెలుగు విరాజిల్లడానికి కంకణబద్దుడనయి ఉన్నట్లు ప్రకటించారు. ఏటా తెలంగాణ తెలుగు మహాసభలను జరుపుతానని ప్రకటించారు. తెలంగాణ గుండె నిండుగ తెలుగు పండుగ అనే మకుటంతో కేసీఆర్ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మహాసభలు- తెలుగు వెలుగుల్ని ప్రపంచానికి పంచాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా అబ్బుర పడేలా నిర్వహంచారు. తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటాలన్న లక్ష్యసాధనలో పూర్తిగా సఫలమయ్యారు. తెలుగు బంధంతో 42 దేశాల నుంచి తరలివచ్చిన ప్రతినిధులు, వందల మంది కవులు, రచయితలు, రోజూ వేలమంది ప్రజల రాకతో కిక్కిరిసిన ప్రాంగణాలతో కోట్లాదిమంది భాషాభిమానులకు కన్నుల పండువగా సాగిన మహాసభలు జాతరను తలపించాయి. వేర్వేరు వేదికలపై కవి సమ్మేళనాలు, అవధానాలు, సాహితీ సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలతో అచ్చ తెనుగు నాట్య మాడింది. తెలుగు భాష తనకున్న వివిధ రూపాలతో విశ్వరూపాన్ని ఆవిష్కరించేందుకు ఈ మహాసభలు ఎంతగానో దోహదపడ్డాయి. కొత్తొరవడితో మన సంప్రదాయాన్ని ఆవిష్కృతం చేస్తూ సిఎం కెసిఆర్ తనకు అక్షర జ్ఞానం కలిగించిన గురువు మృత్యుంజయ శర్మకు గురువందనంతో మొదలు పెట్టిన తీరే మహాద్భుతం. ఈనాటి తరానికి మనమెలా నడుచుకోవాలో చేసి చూపారు. అలా మొదలైన సాహితీ సభల్లో తెలుగు తన ప్రాభవాన్ని చాటుకుంది. పండిత పామరజనంతో జనరంజకంగా అయిదు రోజులపాటు జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు భాగ్యనగరికి మరింత శోభను తెచ్చాయి. వేల ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగు మృతభాష కాదని ఈ సభలు నిరూపించాయి. అలాంటి భయాలు అక్కర్లేదని చాటాయి. గురువుకు గూగుల్ ప్రత్యామ్నాయం కాదన్న
ఉపరాష్ట్రపతి వెంకయ్య చేతుల విూదుగా మొదలైన వేడుక ఐదురోజులు ఆద్యంతం అక్షరదోషం లేకుండా సాగింది. జాతరంటే ఇది అన్న రీతిలో సాగింది. మన తెలుగు జాతర ఇదేనని అంతా అనుకునేలా నిర్వహించిన తీరు ప్రభుత్వ చిత్తశుద్దిని, పాలకుడు కెసిఆర్ దక్షతను చాటింది. మాతృభాషాభిమానం మెండుగా గల ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ మాండలిక భాషా సాంస్కృతిక వైభవాన్ని చాటేలా చేశారు. తెలుగు ప్రాభవం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక ఏటా మహాసభల సంబరాలు నిర్వహిస్తామని ఘనంగా చాటారు. అందుకే ఈ ఐదురోజుల పాటు ఎక్కడెక్కడినుంచో వచ్చిన వారు తనివితీరా తెలుగును శ్వాసించారు. ఆత్మీయంగా పలకరించుకున్నారు. తెలుగును ఇక రాజభాష చేస్తామని సిఎం కెసిఆర్ చేసిన ప్రకటన తెలుగు విద్యార్థులకు వెన్నుతట్టేలా చేసింది. ఈ గడ్డవిూద ఉండా లంటే తెలుగు వంటబట్టాల్సిందే అని గట్టిగానే చెప్పారు. తెలుగు మాధ్యమం తప్పనిసరి చేస్తామని, విూడియం ఏదైనా తెలుగులోనే ఏడ్వాల్సిందని సూటిగానే చెప్పారు. మొత్తంగా తెలుగుకు వైభవం రానుంది. మహాసభల అనంతర కార్యక్రామలు కూడా జరుగుతాయనడంలో సందేహం లేదు. ఆంగ్లం నేర్చుకుంటూనే తెలుగును వంట బట్టించుకోవడం అన్నది ఇక తప్పదు. సరైన తీరులో భాషను గాడిలో పెట్టేందుకు కార్యాచరణ రూపొందుతుందన్న ఆశను రగిల్చారు.’తెలుగు భాషలో చదువుకొంటే ఉద్యోగాలు రావు’ అనే భావన పోయేలా సిఎం కెసిఆర్ చేశారు. ఇదేస్ఫూర్తిని ఇకనుంచి ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ఈ భాషా బ్ర¬్మత్సవ వేడుకల్లో ఎన్నో నిర్మాణాత్మక సూచనలు వెల్లువెత్తిన నేపథ్యంలో వాటిని సక్రమంగా క్రోడీకరించి,మరోమారను సాహితీవేత్తలతో చర్చించి తదుపరి చర్యలను ప్రకటిస్తానని సిఎం ప్రకటించారు.
ముగింపు ఉత్సవాల్లో తెలుగు భాషా ప్రాభవాన్ని, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించిన లఘుచిత్రం సాక్షిగా ఈ మహాసభలు ఒక స్పష్టమైన సంకేతాన్ని ప్రజలకు అందించాయి. భాషా ప్రగతికి హావిూని ఇచ్చాయి. ఇంతటి మహాయజ్ఞాన్ని చేపట్టిన కెసిఆర్ ధన్యుడు.