వేధింపులు భరించలేక గల్ఫ్ ఏజెంట్..
మెట్‌పల్లి, జనంసాక్షి: అప్పలబాధ ఓ వైపు వీసాల డబ్బులు చెల్లించాలనే మరోవైపు తీవ్రం కావడంతో ఓ గల్ఫ్ ఏజెంట్ ఆత్మహత్యచేసుకున్నాడు. ఎస్‌ఐ కిరణ్‌కుమార్ తెలిసిన వివరాల ప్రకారం కథలాపూర్ మండలం భూషణ్‌రావు పేటకు చెందిన రాజాగౌడ్ ఎనిమిదేళ్లుగా జీవనోపాధి కోసం గల్ఫ్ దేశమైన దుబాయికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అక్కడే ఉంటూ వీసాలు పంపుతూ గల్ఫ్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఆరుగురికి వీసాలను పంపించాడు. నాలుగు నెల కిత్రం వారు దుబాయి వెళ్లారు. కాగా ముందస్తుగా చెప్పినట్లుగా అక్కడ పని వేతనం లేక పోవడంతో రాజాగౌడ్‌ను నిర్భంధించి మోసం చేశావంటూ చితకబాదారు. దీంతో నెల రోజల క్రితం వారి నుంచి తప్పించుకుని దుబాయి. నుంచి స్వగ్రామానికి తిరిగొచ్చాడు.
ఇక్కడ బాధితుల కుటుంబసభ్యులు వీసాల డబ్బులు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తూన్నారు. ప్రైవేట్ పంచాయతీలుపెట్టడంతో పాటు పోలాసుస్టేషన్‌ను బాధిత కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో వారి నుంచి ఉపశమనం పొందేందుకు మెట్‌పల్లి మండలం ఆరపేటలోని తన తోడల్లుడి ఇంటికి వారం రోజుల క్రితం వాచ్చాడు. అక్కడే పొందేందుకు మెట్‌పల్లి మండలం కూతరు పెళ్లి చేయడంతో అప్పలు కావడం వీసాల డబ్బులు తిరిగి చెల్లించాలంటూ బాధితుల కుటుంబ సభ్యులు ఒత్తిడి తో మనస్తాపానానికి గురై గురువారం ఉదయం ఇంటి నుంచి బయలు దేరాడు గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు మృతిడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.