వేములవాడకు మహర్ధశ
దేవస్థాన ప్రాధికార
సంస్థ ఏర్పాటు
మౌళికవసతుల కోసం రూ.100కోట్ల విడుదల
ఐదేళ్ళవరకు ప్రతి బడ్జెట్‌లో
100కోట్లు కేటాయింపులు
వేదపాఠశాల,
కళాశాల ఏర్పాటు
ముఖ్యమంత్రి
కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు
కరీంనగర్, జూన్ 18 (జనంసాక్షి) : వేములవాడ దేవస్థానం అభివృద్దికి ప్రత్యేకంగా ఒక ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తామని త్వరలో కెబినెట్ సమావేశంలో తీర్మాణం చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. గురువారం వేములవాడ నాంపెల్లి దేవా లయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ఆలయ అభివృ ద్దికి అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం విలేఖరులతో ఆయన మా ట్లాడుతూ వచ్చే ప్రతిబడ్జెట్‌లో వందకోట్ల రూపాయలచొప్పున వరుసగా ఐదే ళ్ళ కేటాయింపులు చేస్తామని చెప్పారు. వేములవాడ అంటే వేదమూర్తులు వ ేదాలు పఠించే ప్రాంతమని ఇక్కడ వేద, సాంస్కృతిక పాఠశాల కళాశాల కూ డా ఏర్పాటు చేసి ప్రతి నిత్యం వేదాలు విద్యార్థులతో పటించేలా చేస్తామని చె ప్పారు. వేములవాడతో పాటు నాంపెల్లి క్షేత్రం కూడా అభివృద్ది పరుస్తామని దీనికి గాను 124 ఎకరాల స్థలం సేకరించి అక్కడ కూడా విశ్రాంతిభవనం కాటేజిలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వేములవాడకు అతి ప్రాచీనమైన చరిత్ర వుందని కాకతీయుళ కాలంకంటే ముందు ఇక్కడ తూర్పు చాళ్ళుక్యలు చోళ్ళులు ఈ హరిహర క్షేత్రం పొందించారని చెప్పారు. పరమశివుడు కొ లువు వుంటే పద్మనాభస్వామి క్షేత్రపాలకుడని ఇంతటి విశిష్టత ఎక్కడ వుండ
దని సాధార ణంగా ఆంజనేయుడు గరుడు మాత్రమే క్షేత్రపాలకులు వుంటా రని దీనిని అభివృద్ది చేసుకోవాలని సూచిం చారు. ముఖ్యంగా రోడ్లు విస్తరిం చాలని దీనికి గ్రామ ప్రజలు కూడా సహక రించాలని కోరారు. భక్తులు పెరి గినా వారికి తగ్గ వసుతులు కల్పిండం లేదని ఇక భక్తులు ఇబ్బంది పడకుండా దేవాలయంకు వాయువ్యం వైపు 25 నుంచి 30 ఎకరాలు సేకరించి అక్కడ చెరువు శికం పొడిగిస్తామని తెలి పారు. తూర్పుఈశాన్యంలో వుండే కొంత భాగం చెరువు చుట్టు కట్టను విశాలమైన రోడ్డులతో నిర్మిస్తామని చెప్పారు. మూలవాగునుంచి చెరు వులోకి నీరు వచ్చేలా నాలాను వెడల్పుచేసి బ్రిడ్జి కూడా కట్టి నేరుగా తూర్పువైపు నుంచి భక్తులు వచ్చేలా చేస్తామని వివరించారు. హైద రాబాద్ నుంచి బైపాస్ రోడ్డుద్వారా నేరుగా తూర్పు ఉత్తరం ద్వా రా భక్తులు వచ్చేలా చేస్తామని చెప్పారు. నాలుగులైన్ల రోడ్లు సిరి సిల్లకు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే 60కోట్లు విడు దలయ్యాయని ఇక కరీంనగర్ నుంచి కూడా ఈ రోడ్డు వచ్చేలా చర్యలు చేపడుతామని చెప్పారు. దేవాలయంకు వెయ్యి మీటర్ల పరిధలో నాలుగంతస్థుల మేడలు కట్ట కుండా నిషేధం విధించారు. ఈఉత్తర్వులు కలెక్టర్ వెంట నే అమలు పరుచాలని ఆదేశాలు జారీచేశారు. ఈశాన్యం చెరువుతో పాటు మినిస్టేడియం కూడా ఏర్పాటు చేస్తామని చె ప్పారు. శృంగేరి పీఠాధిపతి, కంచికామకోటి ఆగమన పండితుల సల హాలతో గర్బగుడి కదిలించకుండా రెండు మూడు ఎకరాల్లో దేవాలయ ప్రాం గణం నిర్మిస్తామని చెప్పారు. కళ్యాణమండపంతంనుంచి తరలిస్తామని తెలిపారు. కొడిముంజ మిడ్‌మానేరు వరకు దేవాలయం ప్రాంతంను ఆధ్యాత్మికంగా అభివృద్ది చేయడమే కాకుండా పికినిక్ స్పాట్‌గా చేస్తామని విహార యాత్రకు వచ్చి కుటుంబంతో రెండు మూడు రోజులు పిల్లలతో గడిపేలా చేసి వచ్చే ఐదేళ్ళలో గణనీయమైన మార్పు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నాంపెల్లి వరకు మైక్‌లు పెట్టి నిత్యం దేవాలయంలో జరిగే పూజలను ప్రజలకు వినిపించాలని సూచించారు. ముఖ్యంగా ఈశాన్యంలో చెరువు వుండటం ఎంతో మంచిదని దీనిలో నిల్వ నీరు ఎప్పుడు వుండేలా మూలవాగునుంచి నీటిని మళ్ళించడమే కాకుండా చెక్‌డ్యాం కట్టి అందులో బోట్‌షికారు హుస్సేన్‌సాగర్‌లో వున్నట్లు చేద్దామని చెప్పారు. ల్యాండ్‌స్కేప్ నిపుణులను తీసుకొచ్చి ఇక్కడ మంచి అధునాతననిర్మాణాలు చేపడుదామని తెలిపారు. ముఖ్యంగా వేములవాడ నగర పంచాయతీ జనం, పాలక మండలి కూడా సహకరించాలని కోరారు.