వేములవాడ ప్రెస్ క్లబ్ నుండి సయ్యద్ లాయక్ పాషా బహిష్కరణ

 

వేములవాడ సెప్టెంబర్ 10 (జనంసాక్షి)
వేములవాడ ప్రెస్ క్లబ్ టీయూడబ్ల్యూ-హెచ్ 143 ఆధ్వర్యంలో శనివారం రోజున ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చించి తీర్మానం చేశారు.2022 సంవత్సరానికి అక్రిడిటేషన్ కార్డులు మంజూరిలో జిల్లా అక్రిడిటేషన్ కమిటీలో సభ్యుడిగా తమ సంఘం నుండి వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు,రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు సయ్యద్ లాయక్ పాషా ఉన్నారని కానీ కార్డుల మంజూరు విషయంలో అర్హులైన సంఘ సభ్యులకు కార్డులు ఇప్పించేందుకు ఆయన ఎలాంటి ప్రయత్నం చేయలేదు. సంఘ సభ్యులు పనిచేస్తున్న సంస్థలకు అక్రిడిటేషన్ మంజూరు విషయంలో వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదిస్తూ సంతకం చేశారు. ఈ విషయమై లాయక్ పాషా ని వివరణ కోరగా తాను తెలిసి సంతకం పెట్టలేదంటూ ఏమి తప్పు చేయలెదని సభ్యులకు వివరణ ఇచ్చాడు. అతడి వివరణకు సంతృప్తి చెందని సభ్యులు లాయక్ పాషా ను సంఘం నుంచి బహిష్కరించాలని తీర్మానం చేస్తూ ఏకగ్రీవంగా ఆమోదించారు. నేటి నుండి వేములవాడ ప్రెస్ క్లబ్ తో టియూడబ్ల్యూహెచ్ 143 సంఘంతో లాయక్ పాషాకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. తాత్కాలిక అధ్యక్షుడుగా ఏం.డి రఫిక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి పాశం, సీనియర్ రిపోర్టర్ మోకళ్ళ ఎల్లారెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సయ్యద్ రసూల్, ప్రచార కార్యదర్శి వేణు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సయ్యద్ అలీ, కార్యవర్గ సభ్యులు ఎస్ వేణు, సిహెచ్ దేవరాజు, ఎస్ రాజు ,దూస రాజేందర్, బండి శ్రీకాంత్ ,నరేష్, గోగికారి సత్యం, నరేందర్, బండి రజనీకాంత్, ఎండి షబ్బీర్అలీ, ఎండి ఆసీం ,రాపల్లి గంగాధర్, అబ్దుల్ జబ్బర్, మార్పాక శ్రీహరి, తమ్మిశెట్టి రాజు, జగన్ తో పాటు తదితరులు పాల్గొన్నారు