వ్యక్తిగత ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి
ఆసుపత్రి మెట్ల ఎక్కాల్సిన అవసరం రాదు
— మండల వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్
టేకులపల్లి, సెప్టెంబర్ 5( జనం సాక్షి): ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యం మీద దృష్టి సారిస్తే ఆసుపత్రి మెట్లు ఎక్కాల్సిన అవసరం రాదని మండల వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్ తెలిపారు. మండల పరిధిలోని గోలియాతండా లో సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం వైద్య శిబిరం నిర్వహించారు . ఈ వైద్య శిబిరంలో 51 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి తగు చికిత్సలను అందించి మెడిసిన్స్ ఇచ్చారు. దీంతోపాటు 95 మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ చేశారు. జ్వరంతో బాధపడుతున్న ఇద్దరికి రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన వారందరికీ వైద్యాధికారి డాక్టర్ నరేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆసుపత్రి మెట్లు ఎక్కే పరిస్థితి రాకుండా ఉండాలి అంటే వ్యక్తిగత ఆరోగ్యం మీద వ్యాధుల పైన పూర్తి అవగాహన పెంచుకోవాలని అన్నారు. వ్యాధుల బారిన బడిన తర్వాత బాధపడే కంటే వ్యాధులు రాకుండా తగిన వాతావరణం కల్పించుకోవడం అత్యంత విలువైనది అని కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా వ్యక్తిగత పరిశుభ్రత ,పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ మంచి పోషకాహారం ఒత్తిడి లేని జీవితం కల్పించుకోవాలని అవగాహన కల్పించారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సీతమ్మ మాట్లాడుతూ గ్రామస్తులకు ఈ సీజన్లో వచ్చే వ్యాధులు అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందని అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేస్తూ అవగాహన కల్పించారు. ఎట్టి పరిస్థితుల్లో అపరిశుభ్రమైన ఆహారం నీరు,వీధుల్లోని ఆహారం తీసుకోవద్దని సూచించారు. ఆహారం తీసుకునే ముందు మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత అత్యంత పరిశుభ్రంగా చేతులు కడుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా బూస్టర్ డోస్ వేయించుకోవాల