వ్యర్థాలతో విద్యుత్‌

2
సీఎం కేసీఆర్‌తో స్వీడన్‌ ప్రతినిథి బృందం భేటీ

హైదరాబాద్‌,మార్చి18(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్వీడన్‌కు చెందిన బిజినెస్‌ అండ్‌ గ్రీన్‌ టెక్నాలజీ ప్రమోషన్‌ కంపెనీ ప్రతినిధులు కలిశారు. రాష్ట్రంలోని వ్యర్థ పదార్థాలతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేసే అంశంపై వారు సీఎం కేసీఆర్‌తో చర్చించారు. హైదరాబాద్‌లో ప్రతీ రోజు 4500 మెట్రిక్‌ టన్నుల వ్యర్థ పదార్థాలు,రసాయనిక వ్యర్థ పదార్థాలు వెలువడుతున్నాయని.. ప్రతీ 1500 మెట్రిక్‌ టన్నుల వ్యర్థ పదార్థాలతో 36 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయోచ్చని ప్రతినిధులు సీఎంకు వివరించారు. అలాగే హైదరాబాద్‌లో వెలువడే వ్యర్థ పదార్థాలతో 108 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సాధ్యమని సీఎంకు తెలిపారు. తాము చేపట్టబోయే ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేసేందుకు ఆసియా అభివ్రుద్ధి బ్యాంక్‌ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. స్వీడన్‌ ప్రతినిధుల ప్రతిపాదనలను సుదీర్ఘంగా విన్న సీఎం కేసీఆర్‌ వారు వివరించిన అంశాలను పరిశీలిస్తామని హావిూనిచ్చారు.