వ్యవ’సాయం’.. సొసైటీలకు సహకారం
గ్రామీణుల్లో గుణాత్మక మార్పు తెస్తాం..మంత్రి కేటీఆర్
హైదరాబాద్,ఏప్రిల్1(జనంసాక్షి): వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేసేందుకు, గ్రామీణుల జీవితాల్లో గుణాత్మక మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పంచాయితీరాజ్ మంత్రి కేటీఆర్ తెలిపారు. సహకార సంఘాలను బలోపతేం చేసేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. సొసైటీల చైర్మన్లతో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. సమావేశంలో భాగంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సహకార సంఘాలు రైతులను సంఘటితం చేస్తున్నాయని..సహకార సంఘాల కృషి వల్ల రైతులు బాగుపడుతున్నారన్నారు. వీటి పనితీరు వల్ల గ్రామాలలో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. తాగునీరు, వైద్యం, ఆరోగ్యం, విద్యుత్‌పై స్పష్టమైన ప్రణాళిక ఉందని తెలిపారు. అనంతరం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ సహకారసంఘాలకు తక్కువ ధరకే భూమిని ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్న చోట ఇస్తామని తెలిపారు. వ్యవసాయ రంఘ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. గోడౌన్ల నిర్మాణం కూడా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతోందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రాజకీయ ప్రస్ధానం సైతం రాఘవాపూర్ సింగిల్ విండో సోసైటీ చైర్మన్ గా ప్రారంభమైందని.. కాబట్టి అయనకి సహకార సంఘా వ్యవస్ధపై అవగాహన ఉందన్నారు…. సోసైటీల అభివృద్దిలో పూర్తి సహకారం ఉంటుందని మంత్రులు తెలిపారు. సహకార సంఘాల వల్ల రైతులను సంఘటితం చేసి, ఉర్లలో రైతులు బాగు పడుతున్న తీరు అనేక గ్రామాల్లో కనిపిస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కరీనగర్.నల్గోండ సహకార భ్యాంకు, డెయిరీ విజయవంతగా పనిచేస్తున్నాయన్నారు. సహకార సంఘాల చైర్మన్లు పలు అంశాలను మంత్రులు దృష్టికి తీసుకువచ్చారు. చైర్మర్లకి గౌరవ వేతన పెంపు, ప్రోటోకాల్ కల్పన వంటి తమ కోరికలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు… వాటన్నింటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లెందుకు సహకరిస్తామని తెలియ జేశారు. సకాలం రుణాలు చెల్లించిన వారీకి 6శాతం రిబేటు గతంలో ఇచ్చినట్టే ఈ ప్రభుత్వం ఇచ్చేలా చూస్తమని, దీనికి సంబందించి అయా శాఖాధికారులతో మాట్టాడుతామన్నారు. త్వరలోనే అన్ని జిల్లాల చైర్మన్లతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామాణాభివృద్ది శాఖ పథకాల అమలులో సహకార సంఘాలను ఏలా ఉఫయోగించుకోవాలో అలోచిస్తామని మంత్రి తెలిపారు. గ్రావిూణాభివృద్ది, మార్కెటింగ్ శాఖల ద్వారా రైతుల కష్టాలు తీర్చేందుకు గోడౌన్ల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి తెలిపారు. సమావేశంలో వివిధ జిల్లాల సహకార సంఘాల చైర్మన్లు పాల్గోన్నారు.