శేషాచలం ఎన్‌కౌంటర్‌ బూటకం

4

చంద్రబాబుపై హత్యానేరం

కేసు నమోదు చేయాలి

నారాయణ డిమాండ్‌

తిరుపతి,ఏప్రిల్‌18(జనంసాక్షి): చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ బాటకమని, దీనికి బాధ్యుడైన ఏపీ సీఎం ఛంద్రబాబుపై హత్యానేరం మోపుతూ కేసు నమోదు చేయాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్‌ చేశారు. శేషాచలంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌ అని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుడకు తెలిసే అక్కడి పోలీసులు కూలీలను చంపేశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబుకు తెలియకుండా ఎన్‌కౌంటర్‌ జరుగుతుందా అని ఆయన ప్రశ్నించారు. ఎక్కడో ఉన్న కూలీలను తీసుకుని వచ్చి కాల్చి చంపి అక్కడ పడేశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబుపై వెంటనే 302 సెక్షన్‌ కింద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అలాగే ఎఎన్‌కౌంటర్‌ను  సమర్థిస్తూ మాట్లాడిన అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని బర్తరఫ్‌ చేయాలన్నారు. ఎన్‌కౌంటర్‌ విూద ఇతర రాష్టాల్రకు చెందిన సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో అన్ని పార్టీలకు భాగస్వామ్యం ఉందన్నారు. దీనిని కప్పి పుచ్చుకునేందుకు అమాయకులను బలిచేశారని అన్నారు. ఎర్రచందనం కూలీలను అక్రమంగా తుపాకీలతో కాల్చి చంపారని ఆరోపించారు. ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌ వల్ల రెండు రాష్టాల్ర మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వం సామాన్యుల గురించి పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కార్పొరేట్‌ కంపెనీలకు కొమ్ము కాస్తోందని మండిపడ్డారు.పెట్టుబడీదారులకు అనుకూలంగానే భూసేకరణ బిల్లు ప్రవేశపెట్టిందన్నారు. ప్రధాని సెలవు పెట్టకుండా పనిచేస్తున్నారని ఆపార్టీ నాయకులు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా వచ్చే నెల 14న జైలుభరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరణ సాధ్యం కాని హావిూలు ఇస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుల మూడు రోజుల రాజకీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏదైనా హావిూలు ఇవ్వాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించేవారన్నారు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. రైతులకు, డ్వాక్రా సంఘాలకు రుణాలు మాఫీ చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోని ఆయన… రూ.లక్షలు ఖర్చు చేసి రాష్ట్ర రాజధాని నిర్మిస్తామని విదేశాలు చుట్టూ తిరుగుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణం పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుని వ్యాపారం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దీన్ని వ్యతిరేకించే రైతులపై కేసులు పెట్టి జైలుకు పంపించేందుకు కూడా సిద్ధంగా ఉందన్నారు. పోలవరం నిర్మాణం పూర్తి చేసేందుకు కేంద్రం నిధులు మంజూరు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నా… దాన్ని పక్కనబెట్టి పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల తెలుగు తమ్ముళ్లకు లబ్ది చేకూరుతుందన్నారు. ఆ ప్రాజెక్టులో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేంద్రంతో పోరాడి ప్రత్యేక ¬దా సాధించాలని సూచించారు.