శ్రీనగర్ నిట్ లాఠీచార్జిపైరాహుల్ నిరసన
– కొనసాగుతున్న ఆందోనలు
శ్రీనగర్,ఏప్రిల్ 7(జనంసాక్షి): జమ్ము కశ్మీర్ రాష్ట్రం శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఐటీ) వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. కొంత మంది ఇతర రాష్టాల్ర విద్యార్థులు విశ్వవిద్యాలయం ఆవరణలో నిరసన ప్రదర్శనకు దిగారు. దీంతో లాఠీఛార్చ్జేశారు. దీనిని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల సమస్యలు తెఉసుకోవాలని సూచించారు. తమని అక్కడి నుంచి వేరే కళాశాలలకు బదిలీ చేయాలని స్థానికేతర విద్యార్థులు డిమాండ్ చేశారు. స్థానికంగా తమప్రాణాలకు ముప్పు ఉందన్నారు. నిరసన ప్రదర్శన చేసిన వారిలో కొంత మంది విద్యార్థినులు కూడా ఉన్నారు. ‘భారత్ మాతాకీ జై’ అనే నినాదాలతో వారు క్యాంపస్‌లో ర్యాలీ చేశారని అక్కడి అధికారులు తెలిపారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కే రాజేంద్ర కుమార్ క్యాంపస్‌కు చేరుకుని పరిస్థితిని సవిూక్షించారని చెప్పారు. టీ20 ప్రపంచ కప్‌లో భారత్ సెవిూ ఫైనల్స్‌లో ఓడిపోయిన తర్వాత శ్రీనగర్ ఎన్‌ఐటీలో చదువుకుంటున్న కశ్మీర్ విద్యార్థులకు, ఇతర రాష్టాల్ర విద్యార్థులకు మధ్య ఘర్షణ చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో క్యాంపస్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ కారణంగా క్యాంపస్‌ని గత శుక్రవారం తాత్కాలికంగా మూసేసి సోమవారం తెరిచారు. తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయగా పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అక్కడి ఇతర రాష్టాల్ర విద్యార్థులు తమని అక్కడి నుంచి వేరే కళాశాలలకు బదిలీ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. క్యాంపస్‌లోని కొంత మంది సిబ్బంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని, తమని వేధిస్తున్నారని చెబుతున్నారు. అయితే నిట్ వ్యవహారంలో ప్రభుత్వ తీరును రాహుఏల్ తప్పు పట్టారు. విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జి చేయడాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై రాష్ట్రంలోని పీడీపీ-భాజపా ప్రభుత్వాన్ని విమర్శించారు. విద్యార్థులపై లాఠీ ప్రయోగించకూడదని దానికి మద్దతిచ్చే పార్టీలు ఎప్పుడు తెలుసుకుంటాయని రాహుల్ ట్వీట్ చేశారు. దదయచేసి విద్యార్థుల సమస్యలను తెలుసుకోండి.. అర్థం చేసుకొని సమస్య పరిష్కారానికి కృషి చేయండి, వారిని హింసించకండి’ అని రాహుల్ మరో ట్వీట్ చేశారు. విద్యార్థులపై లాఠీ ఛార్జి చేయడంపై న్యాయ విచారణ చేపట్టాలని జమ్ముకశ్మీర్ కాంగ్రెస్ ఇప్పటికే డిమాండ్ చేస్తోంది. అభద్రతాభావంతో స్థానికేతర విద్యార్థులు తమని ఇతర ఎన్‌ఐటీల్లోకి మార్చాలని కోరుతున్నారు.