శ్రీ రామలింగేశ్వర ఆలయంలో పేదలకు దుప్పట్ల పంపిణీ
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 05(జనం సాక్షి):
శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో తూర్పు శాసన సభ్యులు శ్రీ నన్నపనేని నరేందర్ జన్మదినాన్ని పురస్కరించుకొని పేదలకు దుప్పట్లు వస్త్రాలు మరియు పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ.
తూర్పు నియోజక వర్గ అభివృద్ధి ప్రధాత శాసన సభ్యులు శ్రీ నన్నపనేని నరేందర్ పుట్టినరోజు సందర్బంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేక అర్చనాదులు కావించి తదనంతరం పేదలకు దుప్పట్ల పంపిణి చేయడం జరిగింది.తదనంతరం పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ జరిగింది ఇట్టి కార్యక్రమాలకు సహకారం అందించిన శ్రీ కటకం రాములు చిట్టి మల్ల సురేష్ గార్లను ట్రస్ట్ చైర్మన్ అప్పరాజు రాజు అభినందించారు.
కార్యక్రమంలో ముఖ్య అర్చకులు శ్రీ తనుగుల రత్నాకర్ అయ్యగారు మరియు ట్రస్ట్ చైర్మన్ అప్పరాజు రాజు సభ్యులు చిట్టిమళ్ళ సురేష్ కటకం రాములు బిట్ల శేఖర్ గంగిశెట్టి హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area