సంఘ్‌ ముక్త్‌ భారత్‌ కావాలి

3
– ప్రమాదంలో ప్రజాస్వామ్యం

– బీహార్‌ ముఖ్యమంత్రి నీతీష్‌ కుమార్‌

పట్నా,ఏప్రిల్‌ 16(జనంసాక్షి):’అటల్‌ బిహారీ వాజపేయి, ఎల్‌ కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీ లాంటి సమర్థులను ఉద్దేశపూర్వకంగా పక్కకుతప్పించి ఇప్పుడు బీజేపీని తమ చేతల్లోకి తీసుకున్న నేతలంతా సెక్యులరిజంపై విశ్వాసంలేనివాళ్లే. అనుకోని విధంగా అధికారం వారి చేతికే దక్కింది. దీంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. అందుకే సంఘ్‌ శక్తుల నుంచి భారత్‌ ను కాపాడుకోవాలి. సెక్యూలర్‌ పార్టీలంతా ఏకమై ‘సంఘ్‌ ముక్త్‌ భారత్‌'(సంఘ్‌ రహిత భారత్‌) కోసం కృషిచేయాలి’ అని జేడీయూ అధ్యక్షుడు, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.2019 సార్వత్రిక ఎన్నికలలోగా లౌకిక పార్టీలను ఒక వేదిక విూదకు తీసుకురావడానికి కృషి జరగాలని నితీశ్‌, ఈ క్రమంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఒక గూటికి చేరాలని పిలుపునిచ్చారు. వ్యక్తి గతంగా తాము ఏ రాజకీయ పార్టీ సిద్ధాంతానికి  వ్యతిరేకం కానప్పటికీ సంఘ్‌ పరివార్‌ వేర్పాటువాద భావాలను తప్పకుండా నిరసిస్తామన్నారు.