.*సకల విఘ్నాలు తొలగాలి*
సకల విఘ్నాలు తొలగించే ఆ విగ్నేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఓరుగంటి నాగేశ్వరరావు అన్నారు. శనివారం గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్ఞానం, లక్ష్య సాధన, నైతిక విలువలు, ప్రకృతి పరిరక్షణ వంటి సుగుణాలను వినాయక చవితి పండుగ మనకు నేర్పుతుందని అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లి విరిసేలా,ఆనందంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. . తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగేలా, సుఖ శాంతులతో జీవించేలా,గ్రామపంచాయితి ప్రజలందరికీ ఆ ఏకదంతుని దీవెనలు అందాలని ప్రార్థించారు. ప్రజలందరూ సుఖసంతులతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అన్నారు.అనంతరం జరిగిన లడ్డు పాటలో 42వేలకు గోళ్ల అనిల్ కుమార్ లడ్డు ను దక్కించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి. నాగేశ్వరరావు,నాగరాజు, జిల్లా కార్యదర్శులు ఓరుగంటి నరసింహారావు,విజయ శంకర్,గోళ్ల సంగయ్య,సాయి బాబు,జిల్లా కార్యవర్గ సభ్యులు సుభ్రహ్మణ్యం,మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.