సబ్సిడీపై రైతులకు పవర్ టిల్లర్లు
వినుకొండ, జూలై 17 : వ్యవసాయ యాంత్రీకరణ పద్ధతులలో భాగంగా 2012-13 సంవత్సరానికి రైతులకు అవసరమైన రోటో వేట, పవర్‌టిల్లర్లు సబ్సిడీపై అందిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి సరిత మంగళవారం ఇక్కడ తెలిపారు. మండల కేంద్రమైన వీపురూలోని ఎంపిడివో కార్యాలయంలో ఆదర్శ రైతుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పథకాల గురించి ఆదర్శ రైతులకు వివరించారు. ప్రతి ఒక్క ఆదర్శ రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.