సభకు నమస్కారం 17 మంది ఎమ్మెల్సీలకు వీడ్కోలు

1
హైదరాబాద్‌,మార్చి27(జనంసాక్షి):  రాష్ట్ర శాసనమండలిలో పదవీకాలం ముగుస్తున్న 17 మంది ఎమ్మెల్సీలకు తోటి సబ్యులు ఘనంగా వీడ్కోలు పలికారు. మండలిని నిరవధికంగా వాయిదా వేసిన తర్వాత చైర్మన్‌ స్వామిగౌడ్‌ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పదవీకాలం ముగుస్తున్న ఎమ్మెల్సీలను సత్కరించారు. ఉప ముఖ్యమంత్రులు మహమూద్‌ అలీ, కడియం శ్రీహరి, ఈటెల రాజేందర్‌, ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్‌, మండలి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసన మండలి భవనం ముందు గ్రూప్‌ ఫోటో దిగారు. మరోవైపు, ముగ్గురు ఎమ్మెల్సీలను పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ సభ్యులుగా నియమిస్తున్నట్లు మండలి ఛైర్మన్‌ స్వామి గౌడ్‌ ప్రకటించారు. పాతూరి సుధాకర్‌ రెడ్డి, రాములు నాయక్‌, ఫారూక్‌ హుస్సేన్‌ ను కమిటీకి అపాయింట్‌ చేసినట్లు తెలిపారు. అంచనాల కమిటీ సభ్యులుగా కె.జనార్థన్‌ రెడ్డి, డి.రాజేశ్వర్‌, ఎం.ఎస్‌.ప్రభాకర్‌ లను నియమించినట్లు వెల్లడించారు. పబ్లిక్‌ అండర్‌ టేకింగ్‌ కమిటీ సభ్యులుగా ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్‌, పూల రవీందర్‌, ఎం.రంగారెడ్డిలను అపాయింట్‌ చేసినట్లు స్వామిగౌడ్‌ ప్రకటించారు.