సర్కారువెనకడుగు

1A

– పీఎఫ్‌ కొత్త నిబంధనలు రద్దు

– కేంద్రమంత్రి దత్తాత్రేయ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19(జనంసాక్షి):ప్రావిడెంట్‌ ఫండ్‌ కొత్త నిబంధనలపై కేంద్రం వెనక్కు తగ్గింది. భవిష్యనిధి(పీఎఫ్‌) ఉపసంహరణపై ప్రతిపాదించిన కొత్త నిబంధనలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రకటించారు. మరో మూడు నెలల పాటూ పాత నిబంధనలనే కొనసాగిస్తామని దత్తాత్రేయ ప్రకటించారు. ఉద్యోగులు, యాజమాన్యాలతో చర్చలు జరిపి కొత్త నిబంధనలు తయారు చేస్తామన్నారు.పీఎఫ్‌ కొత్త నిబంధనల కారణంగా ఉద్యోగులు, కార్మికులు గందరగోళానికి గురవుతున్నారని మంత్రి పేర్కొన్నారు.  ఈపీఎఫ్‌ కొత్త నిబంధనలపై దేశవ్యాప్తంగా కార్మికులు ఆందోళనలు చేశారు. బెంగుళూరులో గార్మెంట్‌ ఫ్యాక్టరీ ఉద్యోగులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. దాంతో కేంద్రం దిగి వచ్చింది. జులై 31 వరకు పాత నిబంధనల ప్రకారమే పీఎఫ్‌ ఉపసంహరణలు జరుగనున్నాయి. ఆగస్ట్‌ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం.. పీఎఫ్‌ ఖాతాకు యాజమాన్యం చెల్లించే వాటాకు కార్మికులు దాదాపు మూడు రెట్లు ఎక్కువ వాటా చెల్లించాల్సి ఉండటంతో దేశవ్యాప్తంగా కార్మికలోకం భగ్గుమన్నది. బెంగళూరులో కార్మికులు చేపట్టిన ఆందోళనను కేంద్రం సవిూక్షించిదని. దీంతో నూతన ఫిబ్రవరి 10న జారీచేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇకపై పీఎఫ్‌ ఉపసంహరణపై పాత పద్దతే కొనసాగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.