సహృదయ స్వచ్చంద సేవకుడు ఆర్.ఎస్
ఆయనొక నిస్వార్థ సేవా పారాయుణుడు
ఆయనొక సామాజిక కార్యకర్త
ఆయనొక సాహితీ ప్రియడు
ఆయనొక విశ్లేషకుడు
ఆ ప్రాంతంలో ఆయనొక సుపరిచితుడు
తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణ రైతాంగ సాయుద పోరాటంలో విప్లవ కిశోరాలను గన్న వీరభూమి పాలకుర్తి నాటిసో మనాధుడు ,బ్రమ్మెర పోతనలనుంచి నేటి ఐలమ్మ,చుక్క రామ య్య,సీ.రాఘవాచారి,అంపశయ్య నవీన్‌లు ఆమట్టి పరిమాలే.ఆ వారసత్వాన్నే సామాజిక సేవా కార్యక్రమంగా మరో రూపంలో అందుకున్న సహృదయుడు ,సంఘసేవకుడు శ్రీరాపాక సత్యం.ఈ పేరుతో బహుశా ఆయనను చాలా తక్కువ మంది గుర్తు పడతా రు.కానీ వరంగల్ జిల్లాలోని పాలకుర్తి మండల కేందానికి వెళ్లి ఆర్‌ఎస్ అంటే ఆబాల గోపాలంతో ఆయన్ను చూపిస్తారు.ఈ రెండు పొట్టి అక్షరాలతో సుపరిచితమైన వ్యక్తులు ఈ ప్రాంతంలో అరుదు.శ్రీ ఆర్‌ఎస్ పాలకుర్తి గ్రామానికి చెందిన శ్రీ రాపాక వెంకట య్య -జయలక్ష్మి దంపతుల పుణ్యఫలంగా తేది 03-9-1949న జన్మించారు.నిజాం కభంధ హస్తాలనుంచి దోపిడీ గడీల నుంచి ప్రజల విముక్తి చెందిన రోజులు పోరాట విరమణ జరగలేదు. ఊళ్లన్ని బిక్కుబిక్కమంటున్న రోజులు.వ్యవసాయము వ్యాపారము చేతివృత్తులన్ని కుంటుపడ్డ రోజులు.ఊళ్లోనే ఉన్న ఖాన్గీ బడిలోనూ ,సర్కారు పాఠశాలల్లోనూ మాధ్యమిక విద్యను పూర్తి చేసుకుని ఎన్నో కష్టాలతో ఆనాడు ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుగా ఉన్న హన్మకొం డ కళాశాలనుంచి 1965లో హెచ్‌ఎస్సీ పూర్తి చేశారు. ఆర్థిక ఒడిదొడుకులుకుటుంబ బాధ్యతల సమస్యలతో కొట్టుమిట్టాడడం వలన ఉన్నత చదువులు చదవాలని లోపల ఉన్న దురదృష్ట వశాత్తు అవి కార్యరూపం దాల్చలేదు.ఈఅ నేపధ్యంలో ఆయన తిరిగి పాలకుర్తి చేరుకున్నారు.బహుశా ఈ నేపధ్యంకు కావచ్చు.గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు నివాస,ఆదాయ,కుల ధృవీకరణ వంటి సర్టిఫికేట్ల కోసం తన దగ్గరకు వచ్చిన వాళ్లను ఆయా కార్యలయలకు తీసుకెళ్లి సాహయపడుతుంటాడు.అలాగే ప్రభుత్వ పథకాలకు సంభంధించి గ్రామీణ ,పేద ప్రజలకు వివరించడం లోనై తేనేమి..వాళ్లతో దరఖాస్తు చేయిం చడమైతేనేమి ఆయన తన శక్తిమేర చేయుతనందిస్తాడు.సాధారణంగా గ్రామీణ విద్యార్థులు ,పేదలు అధి కారుల కార్యాలయాలకు రావడం వచ్చి తమ సమస్యలను చెప్పుకో వడంలో జంకుతుంటారు.అలాంటి వాళ్లకి ఆయన వాయిస్ అని చెప్పు కోవచ్చు.నిరాక్ష్యరాస్యులన వారికి స్వయంగా తానే దరఖాస్తు కూడా రాసిఇస్తాడు.కాబట్టే ఆర్‌ఎస్ ఎప్పు డూ ఏదో ఒక పనిని తలమీ ద పెట్టుకుని బిజీగా ఉంటాడు. కొం త మంది తోటివారు ఎందుకీ కంచి గరుడ సేవా అన్న పట్టించుకోడు.అదే ఆయన పత్య్రేకత. అందుకే ఆర్‌ఎస్ అందరివాడు అయ్యాడు. అట్లని ఆర్‌ఎస్ జీవితం వడ్డించిన విస్తరేం కాదు. పెద్దకొడుకుగా కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. ఒకప్పుడు జీవితభీమా ఏజెంట్‌గా, పత్రిక ఎజెంట్‌గా మొదలు పెట్టిన సాధారణ జీవితం అతనిది. ప్రాథమిక దశలో అతను కొంత కాలం తపాల శాఖలో విధులను నిర్వహించా డనుకు ంటాను. రాను రాను అవన్ని తగ్గి తన జీవిత కాలంలో ఎక్కువ భాగం సేవా రంగంలోనే గడుపుతున్నాడు. ముఖ్యంగా సమాజాన్ని చైతన్య పరిచే సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నా లయన్స్ క్లబ్ వినియోగ దారుల సంఘంలోని బాధ్యతలను నిర్వహిస్తునే తనలోని సృజనాత్మక శక్తిని ప్రేరణదాతుగా నిలిచే సంస్కృతిక రంగానికి సంబంధించిన సోమనసాహితి సమితికి కార్యదర్శిగాను అట్లాగే సోమన కళాపీఠానికి గౌరవ సలహాదారునిగాను సేవలాంది స్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఉద్యమం నడిపిన ప్పుడు ఆ. స్పూర్తికి ప్రతినిధిగా ఆరోగ్యం సహకరించకపోయిన నిరాహార దీక్ష చేసాడు. స్వచ్ఛమైన ప్రేమకు సంస్కృతికి పట్టుకొమ్మ లైన పల్లెటూర్లు కూడా ప్రపంచీకరణ ప్రభావం అని చెప్పి కలుషితమౌతున్నాయి. అధునిక సంబంధాల, ఆర్థిక సంబంధాలుగా రూపాంతరం చెందిన ప్రస్తుత పరిస్థితులలో ఆర్‌ఎస్ లాంటి సేవా తత్పుర్షుల్నీ వారి సామాజిక దృక్పదాన్ని ఆశించలేము. పైగా వెక్కిరింపులు, హెలనలు లాంటివి, వెనుక నుంచి వినాల్సి వస్తుంది. అవన్ని పట్టించుకోకుండా ముందుకు సాగడమే సేవా దర్ముల లక్ష్యం కావాలి. సంప్రదాయ సమాజం ఎప్పుడు కొత్తను హర్షిం చదు. స్వాగతించదు. పైగా మార్పు అంటే దానికి భయం. అక్షర జ్ఞానం కలిగిన వాళ్లు ఆలోచించక పోతే సగటు మనిషిని గురించి ఎవరు ఆలోచిస్తారు..? అయితే సమాజమంతా ఏడారి కాదు. ఆ ఏడారిలో కూడా అక్కడక్కడ ఒయాసిస్సులు ఉంటాయి. చలువ పందిళ్లు ఉంటాయి. అందులోని చలివేంద్రమే మా ఆర్‌ఎస్. అందుకే మా అభినందనలు.
– డా. శంరామంచి శ్యాం ప్రసాద్
పాలకుర్తి