సాంఘీక సంక్షేమ హాస్టళ్లలో పేరుకుపోతున్న సమస్యలు


లక్షలాదిమంది పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థిని విద్యార్థులు సాంఘీక సంక్షేమ హాస్టళ్లలలో చదువుకున్న వారందరూ నేడు బంగారు బతుకులు బతుకుతున్నారు. ఉన్నత చదువులు చది వి మంచి మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రు లయ్యారు. ఈమాట ఒకనాటి మాట కాని నేడు ప్రభుత్వ సాంఘీక, సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ప్రభు త్వాలు అవలంభిస్తున్న విధానాల మూలంగా, హాస్టళ్లు మూసివేత దశలో ఉన్నాయి. హాస్టళ్లను పర్యవేక్షించడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహిరిస్తుంది. సమస్యలు మాత్రం చెత్తకుప్పల్లా పేరు కుపోతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 2563 వసతి గృహాలున్నాయి. ఇందులో 1830 బాలుర హాస్టళ్లు, 1300 బాలికల హాస్టళ్లు ఉన్నా యి. ప్రతి సంవత్సరం 3,36,632 లక్షల మంది విద్యార్థులు సాం ఘీక సంక్షేమ హాస్టళ్లలో ఉండి విద్యను అభ్యసిస్తున్నారు. 2563 వసతి గృహాల్లో 1100లకు పైగా హాస్లళ్లు అద్దెభవణాలలో కొనసా గుతుండగా అందులో 800 హాస్టళ్లు శిథిలావస్థలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సాంఘీక సంక్షేమ హాస్టళ్లలో స్వంత భవణాలను నిర్మిస్తామని ప్రభుత్వం హామీల వర్షం కురిపించిన్పటికీ నేటి వరకు అమలుకు నోచుకోకుండా వట్టిమాటలుగానే మిగిలిపోయాయి.య మరికొద్ది రోజుల్లో 2013 విద్యాసంవత్సరం పాఠశాలలు ప్రారంభం కావస్తున్నప్పటికి హాస్టళ్ల గురించి ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి చేపట్టిన ఇంది రమ్మ బాటలో సంక్షేమ హాస్టళ్లలో బస చేసి ముఖ్యమంత్రి హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కోంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. శిథిలావస్థలో ఉన్నటు వంటి హాస్టళ్లకు నిధులు కేటాయించి అభివృద్ది పరుస్తామని చెప్పారు. ప్రతి సంవత్సరం హాస్టళ్ల అభివృద్దికి కోట్లాది రూపాయలు నిధులు కేటాయిం చినప్ప టికీ, నిధులన్నీ పక్కదారి పడుతున్నాయి. 2012లో మరుగు దొడ్లు మూత్రశాలలు నిర్మాణం, ప్రహరి గోడల నిర్మాణం పనుల కోసం రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు కేటాయించగా ఇట్టి నిథులు పనులను ప్రారంభించకుండానే మంత్రి సంబంధిత అధికారులు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినారు. కేంద్ర ప్రభుత్వం హాస్టళ్లు, భవనాల నిర్మాణం కోసం 400 కోట్ల రూపాయలను విడు దల చేసింది. ఇందులో 250 కోట్ల రూపాయలతో అసంపూర్తి నిర్మాణాలు చేపట్టి నిధులను దుర్వినియోగం చేశారు. సకాలంలో పనులను పూర్తి చేయకపోవడం వల్లే నిధులు తిరిగి వెనక్కి వెళ్లి పోతున్నాయి. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. మెస్‌ చార్జీలు తూతూ మంత్రంగా పెంచినప్పటికీ విద్యార్థులకఎచు ఏ మాత్రం సరి పోవడం లేదు పౌష్ఠికాహార లోపం తో విద్యార్ధులు అనారోగ్యాల బారి న పడి తనువు చాలిస్తున్నారు మరోవైపున వివద్యార్థులకు కేటా యించిన నిధలను హస్టల్‌ వార్డెన్లు పందికొక్కుల్లా భోంచేస్తున్నారు. హాస్టల్‌ వార్డెన్లు విద్యార్థులకు అం దుబాటులో ఉండకుండా వారికి ఇష్టం వచ్చినప్పుడల్లా వస్తారు, పో తారు. విద్యార్థుల స్థితి గతులపై అంచనాకూడా లేకుండా పోయిం ది.వార్డెన్లు ఇష్టాను సారం గా వ్యవ హరిస్తున్నారు. సాంఘీక సంక్షేమ హస్టళ్ల నిర్వహణ నుంచి ప్రభుత్వం క్రమక్రమంగా తప్పుకుంటుంది. హాస్టళ్లల్లో ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్‌ పోస్టులను భర్తీచేయడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుంది. మూడు హస్టళ్లకు కలిపి ఒక వార్డెన్‌ ఇన్‌చార్జిగా పర్యవేక్షించడం ద్వారా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వార్డెన్లు నియామకాన్ని చేపడ తామని ప్రభుత్వం చెపుతున్నప్పటికీ ఆ హామీని ఇంతవరకు నిలబె ట్టుకోవడం లేదు. హాస్టళ్లలో ఏమి జరుగుతోందో తెలియడం లేదు. సాలకులు అవలంభిస్తున్న విధానాల మూలంగా హాస్టళ్లు కునారి ల్లుతున్నాయి. హాస్టళ్లలో 50 మందిలోపు ఉన్న హస్టళ్లను మూసివే స్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా, మరోవైపు కేంద్ర మంత్రి బలరాం నాయక్‌ మాత్రం భారతదేశ వ్యాప్తంగా మండలా నికో హాస్టల్‌ నిర్మిస్తామని బలరాంనాయక్‌ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక విధంగా ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకటనమ రోలా ఉంది. ఇద్దరి ప్రకటనలతో నవ్వాలో ఏడవాలో అర్థకావ డంలేదు. సాంఘీక సంక్షేమ హాస్టళ్లను ఎత్తివేస్తే ఊరుకునేది లేదని ప్రజా విద్యార్థి యువజన ఉద్యమాల ద్వారానే హస్టళ్లను రక్షించు కుని ప్రభుత్వానికి కళ్లు తెరిపిస్తామని హాస్టళ్లు పరిరక్షించు కుంటా మని విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. హాస్టళ్లు విద్యార్థులకు కాస్మోటిక్‌ చార్జిలు పెంచడం లేదు, దుస్తులు, దుప్పట్లు, పుస్తకాలు నోటుబుక్స్‌, కొబ్బరినూనే అందించకుండా కాలయాపన చేస్తున్నారు. కొన్ని హాస్టళ్లలో మరుగుదొడ్లు స్థానపు గదులు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. హాస్టళ్ల నిర్వాహణ కోసం వేసిన కమిటీలు సమర్ధవంతంగా పని చేయడం లేదని విమర్శలు ఎదురవుతున్నాయి. హాస్టల్‌ వార్డెన్లు, హాస్టల్‌ కమిటీలు కుమ్మక్కై విద్యార్థులకు అందించాల్సిన బియ్యం, పప్పులు, నూనె, తదితర వస్తువులను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తుండగా అనేక మంది వార్డెన్లు దొంగలాగ దొరికిపోయారు. ప్రభుత్వం అవలం భిస్తున్న విధానాల మూలంగా హాస్టళ్ల పరిస్థితి మరింత దయనీ యంగా మారింది. ఎదో ఒక కుంటిసాకు చూపి హాస్టళ్ల నిర్వహణ బాధ్యత నుంచి తప్పించుకుని మూసివేతకు కుట్రపన్నుతుంది ప్రభు త్వం. దీంతో లక్షలాది మంది విద్యార్థుల సరిస్థితి అధ్వానంగా తయారుకానుంది. విద్యకు దూరం కానున్నారు. ఇప్పటి వరకు వేలాది మంది విద్యార్థులు చదువుకోలేక ఆర్థిక స్థోమత లేక పేదరికంతో విద్యకు దూరమవుతున్నారకు. విద్య నేడ మార్కెట్‌లో అంగడి సరుకుగా మారింది. కొద్ది రోజులలో ప్రారంభం అవుతున్నప్పటికీ విద్యా సంవత్సరం సమస్యలతో స్వాగతిమి స్తుంటా యి. ప్రభుత్వ ఇప్పటికైనా యాభై మంది విదార్థులున్న హాస్టళ్లను మూసివేత ఆలోచనను విరమించుకోవాలి. నిరుపేద విద్యార్థులకు వసతి కల్పించాలి, సాంఘీక సంక్షేమ హస్టళ్లన బాగు పరిచి విద్యార్థులకు విద్యనందించాలి. హాస్టళ్ల పర్యవేక్షణపై ప్రభుత్వం దృష్టి సారించి హాస్టళ్లను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
– దామరపల్లి నర్సింహారెడ్డి