*సాగు పంటల వివరాలను నమోదు చేసుకోవాలి*: మండల వ్యవసాయ శాఖ అధికారి చంద్రమౌళి.
పెబ్బేరు సెప్టెంబర్ 22 ( జనంసాక్షి ):
పెబ్బేరు మండలం మండలంలోని బూడిదపాడు గ్రామంలో వానకాలం సాగు చేసిన పంట వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారి చంద్రమౌళి పరిశీలించారు. నమోదు అట్టి వివరాలను మండల వ్యవసాయ అధికారి పరిశీలించడం జరిగిందని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి చంద్రమౌళి మాట్లాడుతూ పంట వివరాలను ఆన్లైన్ నమోదు చేయడం జరిగిందని అదేవిధంగా వేరుశనగ పరిశీలించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా బూడిద పాడు గ్రామ రైతు సోదరులు వానాకాలం వేరుశనగ పంటను పెద్ద ఎత్తున సాగు చేశారని రైతులు వ్యవసాయ అధికారికి చెప్పడం జరిగింది వేరుశనగ పంటను జూలై రెండో వారంలో రైతు సోదరులు వేరుశనగ పంటను ఇక్కడ రైతులు విత్తుకున్నారని తెలిపారు. వానకాలం వేరుశనగ నీల తడులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని వ్యవసాయ అధికారి రైతులకు తెలియజేశారు. అదేవిధంగా వేరుశనగలు ప్రస్తుతం లద్దె పురుగు మరియు పేను బంక ఆశించాయని మరియు మచ్చతెగులుఆశించాయని వ్యవసాయ అధికారి చంద్రమౌళి రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ నరేష్ గ్రామ రైతులు శంకర్, వేమారెడ్డి బీసన్న మరియు కృష్ణయ్య గ్రామ రైతులు పాల్గొన్నారు.