సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లను నియమించాలి
ఖమ్మం జిల్లా.తిరుమలాయపాలెం. (అక్టోబర్ 20) జనం సాక్షి. తిరుమలయపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రంలో సమగ్ర సర్వే నిర్వహించిన యువజన సంఘం జిల్లా బృందం”””
ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం తిరుమలయాపాలెం మండలం కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సమగ్రంగా సర్వే చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రామారావు ని కలిసి సర్వే చేయడం జరిగింది .
అనంతరం హాస్పిటల్ ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గొర్రెపాటి రమేష్, కోలా లక్ష్మీనారాయణ, మాట్లాడుతూ
హాస్పిటల్ కామన్ హెల్త్ సెంటర్ (CHC)గా నియామకం చేసి నెలలు గడుస్తున్నా కూడా ఆస్పటల్ వైద్యులు నియమించడంలో ప్రభుత్వం చొరవ చూపటం లేదని మండల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసం మండల కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్లో వైద్యుల కొరత చాలా తీవ్రంగా ఉన్నదని. ప్రస్తుతానికి ఇద్దరు మాత్రమే డ్యూటీ చేస్తున్నారని ఒకలు డిప్యూటేషన్ మీద పనిచేస్తున్నారని ఇక్కడ దాదాపు 11 మంది వైద్యులు అవసరముంది అని ఈ సర్వేలో తేలటం జరిగింది
అదేవిధంగా ఇద్దరు స్టాప్ నర్స్ అవసరం ఉన్నది అని తక్షణమే ఇద్దరు స్టాఫ్ నర్స్ ను కూడా కేటాయించాలని అదేవిధంగా రక్త పరీక్షల కేంద్రాన్ని విస్తృత పరిచి అన్ని టెస్టులు ఇక్కడే జరిపే విధంగా ప్రభుత్వం చర్యను చేపట్టాలని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాముల మోహన్ రావు జిల్లా నాయకులు గుడిచుట్టూ గోపి, తిమ్మిడి బద్రి, భాస్కర్, బేతంపూడి నాగరాజు,మహంకాళి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు..