సామ్రాజ్యవాద గుప్పిట్లో ఆదివాసుల బతుకులు
ప్రపంచీకరణలో ఆదివాసుల బతుకులు దినదినంగా దిగజారిపోయి, దుర్బరమయిన జీవితాలను గడుపుతున్నారు. చత్తీస్‌ఘడ్, ఒడిషా ఆయా రాష్ట్రాలలో చాలా మంది ఆదివాసులు అడవిని నమ్ముకొని బతుకుతున్నారు. పచ్చని అడవిపై ఖనిజాల కోసం సామ్రాజ్యవాద దోపిడిదారుల కన్ను పడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌హంట్ పేరిట అధర్మ యుద్దానికి దిగుతోంది. ఆదివాసి ప్రాంతాల్లో ఖనిజాల త్వకాల కసం బడా ప్రాజెక్టుల నిర్మాణం కోసం కార్పోరేట్ శక్తులతో బప్పందాలు జరిగాయి. విశాఖపట్నంలోబాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా వస్తున్న ప్రజా స్వామిక ఉద్యమాలను అణచివేస్తున్నారు. అదివాసుల ప్రయోజనాల కన్న కార్పోరేట్‌శక్తుల ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. వందలకొలది ఎకరాల భూములను కార్పోరేట్ దారులకు కట్టబెట్టు తున్నారురీంతో తమ అస్థీత్వం కాపాడుకోవడానికై ఆదివాసుల పోరుబాటను ఎంచుకున్నారు. మరోవైపు మావోయిస్టుల బుచి చూపి సాయుధ పోలీసు బలగాలు మోహరించి, దాడులకు దిగుతున్నారు. దీంతో ఆదివాసులు తమ తమ గుఢారాలను వదిలి బతుకు తెరువు కోసం దూర ప్రాంతాలకు వలసెల్లిపోయి మహానగరాలు, పట్టణాల లో వెట్టిచాకిరి పనులు చేస్తూ, పస్తులుంటూ, గడ్డురోజులు వెల్లదీ స్తున్నారు. 2009 నుంచి చత్తీస్‌ఘడ్ రాష్ట్రాలలో బస్తర్ ఏరియాలో ప్రతి ఆదివాసీ పల్లెల్లో సాయుధ పోలీసు బలగాలు స్వైర విహారం చేస్తున్నాయి. పాఠశాలలు విద్యార్థులు చదువుకోవాల్సిందిపోయి పోలీసు క్యాంపులతో నిండిపోయినాయి. ప్రభుత్వం నుంచి వైద్య సేవలు కూడా అందడం లేదు. ఆదివాసీలు నాటు వైద్యం పై ఆధారపడి జీవిస్తున్నారు. ఆదివాసులు వండుకున్న ఆహారం తినే వరకు నమ్మకం లేకుండా పోయింది. ఎప్పుడు ఏ క్షణాన దాడులు జరుగుతయో తెలియని అయోమయం. ఆదివాసులు సమస్యల సుడిగుండంలో కోట్టుమిట్టాడుతున్నారు. ప్రజల అరటి తోటలు, కూరగాయల తోటలు ద్వంసం చేశారు. ప్రజలకు వచ్చే ఆదాయ వనరులపై నష్టం చేశారు. దీంతో మరింత వెనుకబడిపోతున్నారు. ప్రజలు ఏర్పాటు చేసుకున్న పాఠశాలలను పోలీసులు తగులబెట్టారు. పిల్లలు చదువుకునే పుస్తకాలు బియ్యం, పప్పులు, నూనే, వండుకునే బాసన్లు నిత్యవసర వస్తువులన అన్నింటిని తగులబెట్టారు. ఇప్పటి వరకు వేలాదిమంది ఆదివాసులను అక్రమంగా అరెస్ట్ చేసి ఏళ్ల తరబడి జైళ్లలో నిర్భందిస్తున్నారు. బేయిల్ వచ్చినా మళ్లీ ఏదో ఒక కేసు బనాయించి జైళ్లలో అక్రమంగా నిర్భందిస్తున్నారు. దీంతో ఆదివాసులు చెట్టుకొకరు, పుట్టకొకరు ఏకాకిలా బతుకుతున్నారు. చత్తీస్‌ఘడ్ జైళ్లలో ఆదివాసుల పరిస్థితి దయనీయంగా మారింది. జగదల్‌పూర్ జైళ్లలో 600 మంది ఖైదీలను ఉంచాల్సిందిపోయి 1600 మంది ఖైదీలను ఒకే జైలులో కుక్కినారు. వీళ్లకు కడుపు నిండా తిండిపెట్టడం లేదు. కట్టుకునే బట్టలు కూడా కరువే. మహిళ ఆదివాసులు లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురవుతు న్నారు. జైళ్లలో వైద్య సౌకర్యాలు లేక బయట ఆసుపత్రులకు పంపక ఆరు నెలల్లో ఆరుగురు ఖైదీల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆదివాసుల జీవితమంతా ఇటు పోలీస్ స్టేషన్లలో, అటు జైళ్లకు పరిమితమవుతున్నాయి. బిక్కు బిక్కుమంటూ కాలాన్ని వెల్లదీ స్తున్నారు. వెనక్కిపోతే నుయ్యి ముందుకు పోతే గొయ్యి అనే విధంగా తయారయింది. ఆదివాసీ ప్రాంతాల్లో భూసమస్య దౌర్జన్యంగా సాగుదారుల తొలగింపు తరతరాలుగా అడవిని నమ్ముకుని బతుకు తున్న ఆదివాసులను అడవి నుంచి తరిమివేసి ఖనిజ సంపదను కార్పోరేట్ దారులకు దోచిపెడుతున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయింది. ఆదివాసుల సమస్యలను పాలకులు ఏనాడు పట్టించుకోలేదు. ప్రభుత్వం ఎంత సేపటికి అణచివేత విదానం అనుసరిస్తుంది. ఆదివాసులు షెడ్యూల్డు ఏరియాల్లో గిరిజనుల హక్కుల రక్షణకు దాజకీయ సంకల్పంతో చర్యలు తీసుకోవడం ఆదివాసుల దృష్టిలో దోపిడీ శక్తులుగా ఉన్న వారిని ఆ ప్రాంతాల నుంచి తొలగించడం భూమిపై ఖనిజ సంపదపై వారికి కనీస హక్కులు కల్పించడం వంటి నిర్ధూష్టమైన చర్యలు ఆచరణలో కనిపంచాలి. హింస, ప్రతిహింసల మధ్య ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మావోయిస్టులను అణచివేయడానికి చట్ట సమ్మతమైన మార్గాలన్నీంటినీ రాజ్యం వినియోగించాలని, ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో తీర్మానించారు. మే 25న చత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్ నేతలపై మావోయి స్టులు మందుపాతరలు పేల్చి సామూహిక దాడిలోసల్వాజు డూం వ్యవస్థాపకుడు మాజీ మంత్రి మహేంద్ర కర్మ పిసిసి అధ్యక్షుడు నందకుమార్ పటేల్ మందుపాతరపేలి చనిపోయారు. హింస వల్ల రాజ్యహింస చెలరేగుతుంది మహేంద్రకర్మ 2005లో సల్వాజుడూం ప్రారంభించారు. అనేక మందికి తుపాకులిచ్చి శిక్షణనిచ్చారు. మావో యిస్టులపై పోరాడేందుకు 2008 వరకు సాగింది. అత్యున్న తమయిన న్యాయస్ధానం సల్వాజుడూంను రద్దు చేయాలని రమణ్ సింగ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో కొద్ది కాలానికి సల్వాజు డూం పూర్తిగా రద్దయింది. అందులో పని చేసిన గిరిజన యువకు లను స్పేషల్‌పోలీసు అధికారులంటూ పోలీసుల్లోకి తీసకున్నారు. కేంద్రం అటు మావోయిస్టులతో శాంతి చర్యలు జరిపినట్టయితే హింసకు పరిష్కార మార్గం దొరుకుతుంది. దండకారణ్యంలో పదిసంవత్సరాలుగా ఆదివాసులపై దాడికి పూనుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం అమెరికా సామ్రాజ్యవాద ఆదేశాల ప్రకారం ఆదివాసులపై అధర్మ యుద్దానికి దిగుతోంది. ఆదివాసులు జల్-జింగిల్-జమీన్‌పై తమ అడవి సంపదను కాపాడుకోవడానికి ప్రాణాలు అర్పించినా వీరోచితంగా పోరాడుడున్నారు. 1950లో భారత్ రాష్ట్రపతి చత్తీస్‌ఘడ్, గుజరాత్, మహారాష్ట్ర, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలను గిరిజన ప్రాంతాలను నోటిఫై చేస్తూ వాటిని షెడ్యూల్డు ప్రాంతాలుగా ప్రకటించారు. ఆదివాసలులు గిరిజనుల సలహాలు సూచనల మేరకు అభివృద్ది ప్రాణాలికలు ప్రాజెక్టులు ఏర్పాటు చేయాల్సిఉంటుంది. నోటిఫై చేసిన గ్రామాలను షెడ్యూల్డ్ హోదా నుంచి తొలగించాలన్న కొత్త గ్రామాలన షెడూల్డ్‌లోకి చేర్చాలన్నా ఆ అధికారం రాష్ట్రపతికే ఉంటుంది. ఆ నిర్ణయం ఆయా రాష్ట్రాల గవర్నర్ నిర్ణయం తీసుకున్నకే అమలు చేయాల్సిఉంటుంది. ఆదివాసుల సంప్రదాయాలు, చట్టాలు ఉన్నాయి. తరతరాలుగా ఆదివాసి గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలపై అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాల్లో గిరిజనుల సమస్యలపై చర్చకు రావడం లేదు గిరిజనుల నుంచి ఎంపికయిన ప్రజాప్రతినిధుల మాట చెల్లుబాటు కావడం లేదు. ఆదివాసులు వ్యవసాయం ఇప్పడు ఇప్పుడే నేర్చుకుంటున్నారు. ఆదివాసీ ప్రాంతాలలో బహుళజాతి కార్పోరేటు సంస్థలయిన టాటా, నవీన్ జిందాలి, పోస్కో, వేదాంత, నవీన్ మిట్టల్, సలీం, రిలియన్స్ లతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పశ్చిమ బెంగాల్, ఒడిషా, చత్తీస్‌ఘడ్ అడవిలో ఉండే ఖనిజ సంపదను కార్పోరేట్ దారులకు కట్టబెడుతుంది. ఎన్నికల ముందు ఆదివాసులకు అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ ఊదరగొడుతు న్నారు. తప్ప ఆదివాసులను పట్టించుకున్న దాఖలాలు లేవు. కార్పోరేట్ శక్తులతో కుమ్మక్కయిన పాలకులు రాజ్యంగాన్ని ఉల్లంఘించారు. అడవిలో సంపదను దొచుకోవడానికి కార్పోరేట్ దారులకు ఊడిగం చేస్తున్నారు. దీంతో పర్యావరణం సమస్యలు తలెత్తుతున్నాయి. స్వాతంత్య్రం సిద్దించి 66 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ నేటి వరకు ప్రభుత్వ పధకాలు ఆదవాసుల ధరికి చేరడం లేదు. సామాజికంగా అర్థికంగా రాజకీయంగా ఆదివాసులు అన్ని రంగంలో వెనుకడ్డారు. కాబట్టి ఇవాళ ఆదివాసులు పెద్ద ఎత్తున ఉద్యమంలోకి వస్తున్నారు. గ్రీన్ హాంట్ ఆపరేషన్‌తో అమయాక ఆదివాసులు బలైపోతున్నారు. నేటి వరకు మూడు పూటలు తిండికి నోచుకోలేక ఆకలితో అలమటిస్తు తనువు చాలిస్తున్నారు. సౌష్ఠికాహార లోపం వల్ల పుట్టిన కొద్దిరోజులకే శిశుమరణాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఉపాధి హామీ ద్వారా పేదరికాన్ని పారద్రోలతామని వలసలు నిరోధించుతామని పేదల కళ్లల్లో వెలుగులు నింపామని గొప్పలు ప్రచారం చేసుకుంటున్న మన్మోహన్ సింగ్ సర్కార్ ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పధకం ఆదివాసులకు అందని ద్రాక్షలాగా తయారయింది. యుపిఏ ప్రభుత్వం వాగ్ధానం ఆహార భద్రత బిల్లు పేదలందరికి నామ మాత్రం ధరకే ఆమార ధాన్యాలను అందించాల్సిన భాద్యతను క్రమ క్రమంగా తప్పకుంటుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పధకాలు ఆదివాసులకు అందడం లేదు. ఎంతసేపటికి పాలకులు ప్రజా విప్లవోద్యమాలన అణచివేయడానికి హింసను ప్రేరేపిస్తుంది తప్ప శాంతి కోసం ఆలోచించడం లేదు. ఆదివాసీ ప్రాంతాలలో పోలీసుల దమననీతి రాజ్యహింసతో పల్లేలు మసకబారుతున్నాయి. సామ్రాజ్య వాద విషసంస్కరణలో ప్రపంచీకరణ విధానాలు అమలులో భాగంగా ఆదవాసుల బతుకులు నడి సముద్రంలో నావలాగా తయారైనాయి. ఆదివాసుల బతుకుల్లో వెలుగు నింపేదెపుడు, హింసకు ముగింపు, శాంతి చర్చల ద్వారానే హింసకు పరిష్కారం దోరుకుతుంది. అలు ప్రభుత్వం ఇటు నక్సలైట్ల శాంతి చర్చలు జరిపేందుకు స్వచ్చంధ సంస్థలు ప్రజాస్వామిక వాధులు న్యాయకోవిధులు మేధావులు రచయితలు ప్రజాసంఘాలు చొరవచూపాలి. చర్యలు జరిగినపుడే ఇరువైపుల సమస్యకు పరిష్కారం రొరుకుతుందని ఆశిద్దాం.
-దామెరపల్లి నర్సింహారెడ్డి