సాహిత్యవేత్త రాళ్లబండి కవితాప్రసాద్‌ ఇకలేరు

3

హైదరాబాద్‌,మార్చి 16(జనంసాక్షి):

ప్రముఖ సాహితీవేత్త రాళ్లబండి కవితా ప్రసాద్‌ ఇకలేరు. తీవ్రమైన అనారోగ్యం తో బాధపడుతూ ఇవాళ తుదిశ్వాస విడ  ిచారు. అనారోగ్యం కారణంగా ఆయన గత నెల 24న నగరంలోని బంజా రాహిల్స్‌లో ఉన్న కేర్‌ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మృతిచెందారు. సాం స్కృతికశాఖలో ఆయన పలు కీలక పద వులను నిర్వహించారు. ఆయన స్వగ్రా మం కృష్ణా జిల్లా నెమలి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆయన డాక్టరేట్‌ తీసుకున్నారు.అష్టావధానం,నవరసావధానం, శతావధానం, ద్విశతావధానం సహా ఐదు వందలకు పైగా అవధానాలు నిర్వహించారు. ఒంటరి పూలబుట్ట, పద్య మండపం, అగ్నిహింస, ఇది కవి సమయం వంటి అనేక పుస్తకాలు రాశారు. కవితా ప్రసాద్‌ మృతితో సాహితీ లోకం మూగబోయిందని పలువురు సాహితీవేత్తలు సంతాపం వ్యక్తం చేశారు.

రాళ్లబండి మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

రాళ్లబండి కవితా ప్రసాద్‌ మృతిపట్ల సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అష్టావధానం, శతావధానం, సహస్రావధానం లాంటి సాహితీ ప్రక్రియల్లో రాళ్లబండి ప్రావీణ్యత సాధించారని పేర్కొన్నారు. సాహిత్యానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. రాళ్లబండి మృతి సాహితీ లోకానికి తీరని లోటని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.