సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించండి
సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు రామచందర్
టేకులపల్లి, సెప్టెంబర్ 21( జనం సాక్షి ): సింగరేణి
వ్యాపితంగా కాంట్రాక్ట్ కార్మికుల తమ న్యాయమైన సమస్యలపై డిమాండ్లు చేస్తూ పరిష్కారం కోసం సమ్మె చేస్తుంటే సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని తక్షణమే కార్మికుల డిమాండ్లు పరిష్కరించి సమ్మెను నివారించాలని సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు గూగులోత్ రామచందర్ అన్నారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ సమ్మె నోటీస్ పై కార్మిక శాఖ అధికారి సమక్షంలో జరిగిన చర్చల సందర్భంగా కార్మికుల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన అధికారులు ఆ హామీని విస్మరించి నిరవధిక సమ్మెకు కారకులయ్యారని హై పవర్ కమిటీ వేతనాలు వెంటనే అమలు చేయాలని కోరుతూ ఈనెల 9 నుండి 13 రోజులు సమ్మె కొనసాగుతుందన్నారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి, సమ్మెను నివారించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఎజ్జు భాస్కర్, గుగులోతు శ్రీను ,వాసం భద్రయ్య ,భానోత్ వీరన్న ,అయితా శ్రీరాములు, బండి వీరభద్రం, రవీందర్, మధు ,సతీష్ ,కన్నయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.