సింగరేణి కాట్రాక్ట్ కార్మికుల పోరాటం ఉధృతం
-చలో అసెంబ్లీకి ప్రయత్నించిన కాంట్రాక్ట్ కార్మికులను,కార్మిక నాయకులను బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు
-వేతనాలు సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాటం కొనసాగుతుంది
-ప్రభుత్వ పోలీసు చర్యలను తీవ్రంగా ఖండించిన జేఏసీ
టేకులపల్లి, సెప్టెంబర్ 13( జనం సాక్షి ): సింగరేణిలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని,ఉద్యోగ భద్రత కల్పించాలని,చట్టబద్ధ హక్కులను సౌకర్యాలను అమలు చేయాలని,ఫిబ్రవరి 9వ తేదీన లేబర్ కమిషన్ సమక్షంలో ఇచ్చిన హామీలను చేయాలని కోరుతూ ఈ నెల 9వ తేదీ నుండి సింగరేణి వ్యాపితంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె నడుస్తున్నది.ఈ సమ్మె డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 30% పిఆర్సీ ను కానీ,జీవో నెంబర్ 22ను కానీ అమలకు చర్యలు తీసుకోవాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల గురించి అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నాడు చలో హైదరాబాద్ అసెంబ్లీ, ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ప్రదర్శనగా వెళ్తున్న కాంట్రాక్ట్ కార్మికులను, కార్మిక నాయకులను పోలీసులు బలవంతంగా, అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు.మహిళా కార్మికులను కూడా చూడకుండా అత్యంత దారుణంగా నిర్బంధాలకు గురిచేసి అరెస్టులు చేశారని జేఏసీ నాయకులు డి. ప్రసాద్, రేపాకుల శ్రీనివాస్, గుగులోతు రామచందర్ లు అన్నారు. ఈ ప్రభుత్వం పోలీసులతో అక్రమంగా చేపిస్తున్న అరెస్టులతో పోరాటం ఆగదని,వేతనాల పెరిగే వరకు కొనసాగిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. అరెస్టులతో నిర్బంధాలతో పోరాటాలను ఆపలేరని అన్నారు. అరెస్టు చేసిన నాయకులను బేషరత్తుగా విడుదల చేయాలని వార�