సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకుందాం….

 

 

 

 

 

 

 

 

పిలుపునిచ్చిన సిపిఐ రాష్ట్ర నాయకులు సారయ్య…
ఇల్లందు సెప్టెంబర్ 3 (జనం సాక్షి)
ఎఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యునీయన్ ఆద్వర్యంలో శనివారం నాడు ఉదయం షిఫ్ట్ నందు గనులపై ,డిపార్ట్మెంట్లు జెకె 5 ఓసి, ఏరియా వర్కషాప్, మేయిన్ హస్పిటల్, జెకె సివిల్,24 సివిల్,  సి ఎస్ పి, సేక్యూరిటి ఆఫిస్, కెఓసి‌,ఏరియా స్టోర్స్ లవద్ద యునీయన్ నాయకులు కార్మికులు పెద్ద ఎత్తున ధర్నాలు చెసి సంబందిత అధికారులకు డిమాండ్లకు సంబంధించిన వినతిపత్రాలు అందచెసారు. స్థానిక జెకె 5 ఓసి నందు జరిగిన ధర్నాకు ముఖ్య అతిథిగా వర్కర్స్ యునీయన్ కేంద్రకమిటీ డిప్యూటి ప్రధాన కార్యదర్శి కె.సారయ్య హజరై తొలుత వినతిపత్రంను జెకె ఓసి మేనేజర్ పి పూర్ణచంద్రరావుకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణిలొ అనేక సమస్యలు పేరుకుపోయినాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల సింగరేణి ఆగమ్యగొచరంగా మారింది అని, ప్రైవేటీకరణ రాజ్యాం ఏలుతున్నది అని ఆయన అన్నారు. సింగరేణిలొ
 కోయగూడెం 3 ఓపెన్ కాస్ట్ను కేంద్ర ప్రభుత్వం అరబిందో అనే ప్రైవేట్ కంపెనీ ఇచ్చినదాన్ని రద్దు చేసి సింగరేణికే ఇవ్వాలని.
సింగరేణిలో వాస్తవ లాభాలను ప్రకటించి, అందులో  35 శాతం కార్మికులకు ఇవ్వాలని,
స్వంత ఇంటి పథకం అమలుకు 2 గుంటల భూమి, ఇల్లు కట్టుకోవడానికి 20 లక్షల రూపాయలు వడ్డీలేని రుణం ఇవ్వాలని,
కోల్ ఇండియాలో కార్మికులకు,సింగరేనిలో అధికారులకీ ఇచ్చినట్లుగా అలవెన్సూలపై ఇన్కమ్ టాక్స్ ను కార్మికులకు తిరిగి చెల్లించాలని,
కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ వేతనాలను ఇవ్వాలని వారు యాజమాన్యంను డిమాండ్ చెశారు. ఇల్లందు ఏరియా
 అన్ని మైన్స్,డేపర్ట్మెంట్ల కార్మికులు పెద్ద ఎత్తున ఈనెల
సెప్టెంబరు 9.న ఇల్లందు ఏరియా జీఎం  ఆఫీస్  ముందు ధర్నాకు కదిలి రావాలని వారు కార్మికులకు పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రాంచి సహయ కార్యదర్శి దాసరి రాజారామ్, ఫిట్ కార్యదర్శులు సంజీవచారి, మంచాల వేంకటేశ్వర్లు, కొరిమి సుందర్, సుబ్బరాజు, భూషనం, నూనె శ్రీనివాస్, గడదాసు నాగేశ్వరరావు, కొంగర వేంకటేశ్వర్లు, అనీత, ముస్తఫా, లచ్చిరామ్, అఫ్జల్, సిపిఐ నాయకులు దేవరకొండ శంకర్, బందం నాగయ్య తదితరులు పాల్గొన్నారు.