సిఎం సహాయనిది చెక్కుల పంపిణీ…
ఫోటో రైటప్: చెక్కులు అందజేస్తున్న నాయకులు…
వరంగల్ బ్యూరో : ఆగస్టు 17 (జనం సాక్షి)
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి, చెక్కులను నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు పలువురికి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసినట్లు దుగ్గొండి మండల పార్టీ అధ్యక్షులు సుకినె రాజేశ్వర్ రావు తెలిపారు.
తిమ్మంపేట గ్రామానికి చెందిన సంగి విజయకు 47 వేలు, కందికొండ కృష్ణమూర్తికి 18 వేలు పొశాల రాజు 60 వేలు ఆడెపు పద్మ 26.వేలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మండల పార్టీ అధ్యక్షులు సుఖినే రాజేశ్వరరావు ఎంపిపి కోమల భద్రయ్య గ్రామ సర్పంచ్ మోడెం విద్యాసాగర్. గ్రామ పార్టీ అధ్యక్షులు గొర్రెజనార్దన్ రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జి తోటకూరి రాజు, సొసైటీ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ఎలకంటి స్వామి మండల నాయకులు బీరం ప్రభాకర్ రెడ్డి, మోడo కోటి. యారా రాజు సీనియర్ నాయకులు టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.