సిద్దయ్యకు కన్నీటి వీడ్కోలు

4

నివాళులు అర్పించిన అధికార, విపక్ష నేతలు –   అధికారికంగా అంత్యక్రియలు

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌ 8 (జనంసాక్షి):

ముష్కరులతో పోరులో  వీరమరణం పొందిన నల్లగొండ జిల్లా ఎస్‌ఐ సిద్ధయ్య భౌతికకాయానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సిద్దయ్య అమర్‌ రహే జోహార్‌ సిద్దయ్య అన్న  నినాదాల మధ్య అంత్యక్రియలు ముగిసాయి. పోలీసలు గౌరవవందనం మధ్య అంత్యక్రియలను ముగించారు. కుటంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఈ ప్రాంతం హృదయవిదారకంగా మారింది. అంతకుముందు జడ్చర్లలో సిమి ఉగ్రవాదాల తూటాలకు నేలకొరిగి వీరమరణం పొందిన ఎస్‌ఐ సిద్ధయ్య అంతిమయాత్రకు భారీగా ప్రజలు తరలివచ్చారు. సిద్ధయ్యకు కడసారి కన్నీటి వీడ్కోలు పలికేందుకు అభిమానులు, జనాలు భారీగా తరలివచ్చారు. దీంతో జడ్చర్ల పట్టణమంతా శోకసంద్రమైంది. సిద్ధయ్య భార్య ధరణీశ కన్నీటిని ఆపుకోలేకపోతోంది. దీంతో ఆమెతో పాటు జడ్చర్ల శోకసంద్రమైంది. ఎస్‌ఐ సిద్ధయ్యకు పలువురు నివాళులర్పిస్తున్నారు. సిద్ధయ్య భార్య ధరణీశ కన్నీరుమున్నీరు అయ్యింది. భర్త మృతదేహాన్ని చూసి ధరణీశ కన్నీటినీ ఆపుకోలేకపోతోంది. ధరణీశ అక్కడికి రావడంతో విషాదకర వాతావరణం నెలకొంది. సిద్ధయ్య కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. అధికారిక లాంఛనాలతో సిద్ధయ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆశ్రునయనాల మధ్య కన్నీటి వీడ్కోలు పలికారు. సిద్ధయ్య భౌతికకాయానికి డీజీపీ అనురాగ్‌ శర్మ, మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, కాంగ్రెస్‌ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రులు విూడియాతో మాట్లాడుతూ  సిద్ధయ్య వీరణమరణం పొందారన్నారు. ఆయన మృతి తీరని లోటు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సిద్ధయ్య విధులు నిర్వహించారు. సిద్ధయ్య ధైర్యసాహసాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సిద్ధయ్య మృతి చెందడం దురదృష్టకరమన్నారు. సిద్ధయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. సిద్ధయ్య కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇక ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడి మృతి చెందిన

ఎస్సై సిద్ధయ్య భౌతికకాయానికి డీజీపీ అనురాగ్‌శర్మ నివాళులర్పించారు. సిద్ధయ్యకు సహచరులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ ఉదయం నుంచి సిద్ధయ్య భౌతికకాయాన్ని పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, సిద్ధయ్య స్నేహితులు నివాళులర్పించారు. సిద్ధయ్య కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎస్సై సిద్ధయ్య భౌతికకాయానికి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు నివాళులర్పించారు. జైపాల్‌రెడ్డి, వీహెచ్‌, ఉత్తమ్‌, జానారెడ్డి, డీకే అరుణ, శ్రీధర్‌బాబు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి మాట్లాడుతూ తీవ్రవాదులతో సిద్ధయ్య వీరోచిత పోరాటం చేశారని కొనియాడారు. సిద్ధయ్య త్యాగం మరిచిపోలేనిదన్నారు. సిద్ధయ్య స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని జైపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సిద్ధయ్య కుటుంబానికి కాంగ్రెస్‌ అండగా ఉంటుందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. సిద్ధయ్య మృతికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని డీకే అరుణ ఆరోపించారు. సిద్ధయ్య త్యాగాన్ని ఆదర్శంగా తీసుకుని తీవ్రవాదాన్ని తుదముట్టించాలని చిన్నారెడ్డి డిమాండ్‌ చేశారు. కొంతమంది ముస్లిం యువకులు తప్పుదారి పడుతున్నారని, తీవ్రవాదులను అడ్డుకునేందుకు పోలీసులకు అధునాతన ఆయుధాలు ఇవ్వాలని వీ.హనుమంతరావు డిమాండ్‌ చేశారు. వీరమరణం పొందిన ఎస్‌ఐ సిద్ధయ్యను కడసారి చూసేందుకు జనం భారీగా తరలిరావడంతో పట్టణం జనసంద్రమైంది. వారి రోదనలతో కన్నీటి సంద్రమైంది.  ఆశ్రునయనాల మధ్య కన్నీటి వీడ్కోలు పలికారు.  సిద్ధయ్య మృతదేహాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు.