సిద్ధిపేటపై గులాబీ జెండా

4

– ప్రజల విశ్వాసాన్ని నిలబడతాం

– మంత్రి హరీశ్‌ రావు

సిద్ధిపేట,ఏప్రిల్‌ 11(జనంసాక్షి):ఎన్నికలేవైనా గెలిచేది మాత్రం టీఆర్‌ఎస్‌ అని మరోసారి స్పష్టమైంది. ఇటీవల జరిగిన అన్ని ఎలక్షన్స్‌ మాదిరిగానే సిద్దిపేటలోనూ సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయింది. 34 వార్డుల్లో 22 స్థానాలను గెలుచుకున్న టీఆర్‌ ఎస్‌? సిద్దిపేట మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. కారు జోరు ముందు నిలవలేక ప్రతిపక్ష పార్టీలు బెంబేలెత్తిపోయాయి. కాంగ్రెస్‌-2, బీజేపీ-2 వార్డులతో సరిపెట్టుకున్నాయి. ఎంఐఎంకు ఒక సీటు దక్కింది. కనీసం ఒక్క వార్డు కూడా గెలుచుకోలేక టీడీపీ చేతులెత్తేసింది. 7 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలుపొందారు.ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి? ప్రజలు టీఆర్‌ఎస్‌ కు పట్టం కట్టారు. 22 స్థానాల్లో గులాబీ అభ్యర్థులను గెలిపించారు. 1వ వార్డులో మల్లికార్జున్‌, 2వ వార్డులో లలిత, 7వ వార్డులో ప్రశాంత్‌, 8వ వార్డులో నర్సయ్య విజయం సాధించారు. 9వ వార్డులో ఉమారాణి, 10వ వార్డులో వేణుగోపాల్‌, 11వ వార్డులో రవీందర్‌, 12వ వార్డులో అక్తర్‌ పటేల్‌ గెలుపొందారు. 15వ వార్డులో భవాని, 20వ వార్డులో జావేద్‌, 23వ వార్డులో లక్ష్మి, 26వ వార్డులో శ్రీనివాస్‌ విజయ బావుటా ఎగురవేశారు. 28వ వార్డులో లక్ష్మి, 29వ వార్డులో ఉమారాణి, 31వ వార్డులో కవిత, 32వ వార్డులో ప్రభాకర్‌ విక్టరీ కొట్టారు. మరో 6 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో, మొత్తం 22 వార్డులు టీఆర్‌ ఎస్కు దక్కాయి.సిద్దిపేట అభివృద్ధి టీఆర్‌ ఎస్‌ తోనే సాధ్యమని నమ్మిన ప్రజలు అందుకు తగ్గ తీర్పిచ్చారు. ప్రతిపక్షాలకు మరోసారి తగిన బుద్ధి చెప్పారు. టీఆర్‌ ఎస్‌ గెలుపుతో? పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

సిద్దిపేట ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం: హరీశ్‌రావు

సిద్ధిపేట ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని  మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సోమవారం వెలువడిన సిద్ధిపేట పురపాలిక ఎన్నికల ఫలితాల్లో 6 వార్డులు ఏకగ్రీవంతో సహా తెరాస 22 స్థానాలు కైవసం చేసుకుంది. దీనిపై ఆయన స్పందిస్తూ… ప్రభుత్వంపై నమ్మకంతో ఆధిక్యాన్ని ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలకు అతీతంగా గెలుపొందిన అభ్యర్ధులందరికీ అభినందనలు తెలిపారు. సిద్దిపేట మున్సిపాలిటీకి సకాలంలో ఎన్నికలు జరగని కారణంగా… 14వ ఆర్థిక సంఘం నిధులు రాలేదని మంత్రి తెలిపారు. ఎన్నికల పక్రియ ముగిసినందున గతేడాది నిధులు, కొత్త నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. పార్టీలకు అతీతంగా గెలిచిన అభ్యర్థులందరూ సిద్దిపేట అభివృద్ధికి కృషి చేయాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మొత్తంగా సిద్దిపేట మునిలిపాలిటీపై మరోసారి టీఆర్‌ఎస్‌ జెండా ఎగరేశామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌దే విజయమని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా సిద్దిపేట మునిసిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హరీశ్‌రావు చెప్పారు. గెలిచిన రెబల్‌ అభ్యర్థులను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానిస్తామని హరీశ్‌రావు వివరించారు.