సిపిఐ జాతీయ మహాసభలకు పిలుపు.

జనం సాక్షి 27 సెప్టెంబర్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
దమ్మపేట మండలంలో
వచ్చే నెల 14 నుండి 18 వరకు విజయవాడలో జరిగే సిపిఐజాతీయ మహాసభలకు వేలాదిగా తరలిరావాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి రావులపల్లి రాంప్రసాద్. దమ్మపేట సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఎస్కే దస్తగిరి అధ్యక్షాన జరిగింది ఈ సందర్భంగా రావులపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని బిజెపి వ్యతిరేక శక్తులను కూడగట్టి కేంద్రంలో బిజెపిని గద్దె దించాలని బిజెపి అనుసరిస్తున్న రైతు వ్యతిరేక చట్టాలను విద్యుత్ సవరణ బిల్లును కార్మిక చట్టాలు పగడ్బందీగా అమలు చేయాలని రాబోయే కాలంలో బిజెపి వ్యతిరేక శక్తులను కూడగట్టి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని ప్రజల కోసం నిరంతరం శ్రమించేది కమ్యూనిస్టులేనని రేపు విజయవాడలో జరిగే జాతీయ మహాసభలలో 20 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారని ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటున్నారని సిపిఐ కార్యకర్తలు సానుభూతిపరులు వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని ఆ జాతీయ మహాసభల్లో అనేక చర్చలు జరుగుతాయని కేంద్రంలో ఉన్న బిజెపిని తుది ముట్టించే వరకు సిపిఐ పార్టీ ప్రజా పోరాటాలు చేస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా తెలిపినారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యార్లగడ్డ భాస్కరరావు మండల సహాయ కార్యదర్శిలు సుంకుపాక ధర్మ బత్తుల సాయి డి లక్ష్మీనారాయణ రాపోలు శివన్నారాయణ పద్దం విజయలక్ష్మి జాన్ బి. తుపాకుల శాంతి గాజుబోయిన కృష్ణవేణి నక్క నాగమణి వీర లక్ష్మి తదితరులు పాల్గొన్నారు