సిపిఐ నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి
-సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు.
బోనకల్ ,సెప్టెంబర్ 18 (జనం సాక్షి) :
ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తూ వ్యవహరించిన ఖమ్మం రూరల్ సిఐపై చర్యలు తీసుకోకుండా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాగం హేమంతరావులపై కేసులు పెట్టడం సరికాదని సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు అన్నారు. మండలంలోని సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం అదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే తమ కార్యకర్తలను పోలీసులు బెదిరించడాన్ని ప్రశ్నిస్తే వారిపై ఆక్రమ కేసులు పెట్టడం అమానుషమన్నారు. కమ్యూనిస్టు నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తే ఊరికునేదిలేదన్నారు. ఈ సమావేశంలో సిపిఐ సీనియర్ నాయకులు జక్కా నాగభూషణం, తోటపల్లి ఆనందరావు, ఆకెన పవన్ తదితరులు పాల్గొన్నారు.