సీఎం కేసీఆర్‌ షడ్యూల్‌ ఇది

1212

ఖమ్మం ,ఏప్రిల్‌ 26 (జనంసాక్షి):

సీఎం కేసీయార్‌ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. బుధవారం ఉదయం పార్టీ ప్లీనరీలో సీఎం కేసీయార్‌ పాల్గొంటారు. ఉదయం 10 గంటలు సీఎం కేసీఆర్‌ చేతుల విూదుగా పతాకావిష్కరణ తో ప్లీనరీ మొదలుకానుంది. ఉదయం 10.20 కి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి.. రెండు నిమిషాల పాటు మౌనం పాటించనున్నారు. 11.00 గంటలకు.. సీఎం కేసీఆర్‌ అధ్యక్షోపన్యాసం చేయనున్నారు. మధ్యాహ్నం 12.00 గంటల నుంచి ఒకటిన్నర వరకు ఆరు తీర్మానాలు ప్రతిపాదించి చర్చించనున్నారు. మధ్యాహ్నం 1.30 కు భోజన విరామం ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు మరో తొమ్మిది తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. సాయంత్రం 4.45 గంటలకు పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్‌.. ప్రతినిధులకు దిశానిర్దేశనం చేయనున్నారు. అనంతరం ఎస్సార్‌ అండ్‌ బీజేఎన్‌ఆర్‌ డిగ్రీ కాలేజీ మైదానంలో.. సాయంత్రం 6 గంటలకు జరిగే బహిరంగ సభలో సీఎం కేసీయార్‌ పాల్గొంటారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.