సీఎం రాజీనామా చేయాలి ఎస్.వి.మోహన్‌రెడ్డి
కర్నూలు, జూన్ 16 (జనంసాక్షి) :
ఉప ఎన్నికల్లో ప్రజల విశ్వాసం కోల్పోయిన నేప థ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తక్షణం రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్సీ ఎస్‌వి మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఎస్వీ కాంప్లెక్స్‌లో విలేకరులతో మాట్లాడారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులకు కనీసం పోటీ ఇవ్వా లని స్థాయికి దిగజారిందంటే ప్రజల విశ్వాసం ఎంతమేరా కోల్పోయిందో ఆర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల నియోజకవర్గాలో ప్ర చారాన్ని రెండు మూడు మార్లు చేసినా ప్రజలు చీకొట్టారని అన్నారు. కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్, వాయలార్ రవి రాష్ట్రంలోని కాం గ్రెస్ ప్రజాప్రతినిధుల చేష్టలను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి ఉప ఎన్ని కల్లో జగన్‌ను విమర్శించినందుకు కాంగ్రెస్, టీ డీపీకి ప్రజలు తగ్గిన బుద్ధి చెప్పారని అన్నారు. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు, కృష్ణరెడ్డి, బాలరాజు, మునీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.