*సీఎం సహాయ నిధి పేదలకు వరం- కార్పొరేటర్ పద్మావతి పాపయ్య యాదవ్*

*రాజేంద్రనగర్.ఆర్.సీ (జనం సాక్షి)* : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం లాంటిదని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ పద్మావతి పాపయ్య యాదవ్ అన్నారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7వ వార్డుకు చెందిన పైసల్ కు 60,000 వేల రూపాయల  ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బుధవారం మైలార్దేవ్పల్లి లోని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నివాసంలో చెక్కును కార్పొరేటర్ పద్మావతి పాపయ్య యాదవ్ అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఉండేదని అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్కరికి సమయానికి అందలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆపదలో ఉన్నవారిని కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పథకానికి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సహకారంతో చెక్కును అందజేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు పాపయ్య యాదవ్, నదీమ్,పాషా తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం చెక్కు అందజేస్తున్న కార్పొరేటర్ పద్మావతి పాపయ్య యాదవ్.