సీజనల్ వ్యాధులను అరికట్టాలి
-ప్రైవేటు ఆసుపత్రుల అధిక ఫీజుల దోపిడిని అరికట్టాలి
-గ్రామాలలో హెల్త్ క్యాంపు లు నిర్వహించాలి
-ప్రగతిశీల యువజన సంఘంఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ ముందు జరిగిన ధర్నా
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 05(జనం సాక్షి):
సీజనల్ వ్యాధులను అరికట్టాలని గ్రామాలలో వెంటనే హెల్త్ క్యాంపులు నిర్వహించాలని ప్రైవేటు , ఆసుపత్రులలో అధిక ఫీజుల దోపిడిని అరికట్టాలని కోరుతూ ఈరోజు ప్రగతిశీల యువజన సంఘం వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ఆ సంఘం నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు
ఈ వర్షాకాలం సీజన్లో భారీ వర్షాలు పడడం వల్ల నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవడం మూలంగా రకరకాల సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి నీరు నిలువ ఉండడం మూలంగా ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా తదితర రోగాలు ప్రబలుతున్నాయి వీటిని అరికట్టుటకు గ్రామాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు అలాగే మండల డివిజన్ కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ను వారు డిమాండ్ చేశారు గ్రామ మండల డివిజన్ కేంద్రాల్లో ఉన్న ఆస్పత్రులకు అవసరమైన వైద్య పరికరాలు మందులు కిట్లను అందజేయాలని వారు కోరారు గ్రామాలలో ప్రైమరీ హెల్త్ సెంటర్ల లో పనిచేస్తున్న హెల్త్ వర్కర్ల తో ఇంటింటి సర్వే నిర్వహించి వ్యాధులను గుర్తించి ప్రజలకు సరైన మందులు అందజేయాలని వారు కోరారు
గ్రామాల్లో నగరంలో వ్యాపిస్తున్న వ్యాధులను ఆసరాగా చేసుకొని ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యాలు వివిధ రకాల పరీక్షలు చేసి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి పేద మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం అజమాయిషి లేనందువలన ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యాల ఆర్థిక దోపిడి పెరుగుతున్నది ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు అలాగే జిల్లా అధికారులు గ్రామాలలో పర్యటించి తగు వైద్య సౌకర్యాలు అందించాలని వారు కోరారు
అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్ హరి సింగ్ గారికి డిమాండ్లతో కూడిన వినతి పత్రమును అందజేశారు
ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలకంటి రాజేందర్ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు రాచర్ల బాలరాజు జిల్లా ఉపాధ్యక్షులు రగసాల సుమన్ జిల్లా సహాయ కార్యదర్శి దినసరి సురేష్ జిల్లా కోశాధికారి ఏ వెంకటస్వామి నాయకులు రంజిత్ హరిబాబు విష్ణు మధు ఇనుముల కృష్ణ లతోపాటు పి వై ఎల్ కార్యకర్తలు పాల్గొన్నారు