సులానగర్ లో పోషకాహారం పై అవగాహన ర్యాలీ

టేకులపల్లి, సెప్టెంబర్ 9( జనం సాక్షి): టేకులపల్లి మండలంలోని సులానగర్ గ్రామపంచాయతీ లో అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో పోషకాహారం పై శనివారంఅవగాహన ర్యాలీ నిర్వహించారు . ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు పి పద్మ, పి రాజేశ్వరి, జి మంగతాయారు, స్థానిక సర్పంచ్ అజ్మీర బుజ్జి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, యుక్త వయసు బాలికలకు పోషకాహారం పై అవగాహన కల్పించారు. సులానగర్ గ్రామంలో భారీ ర్యాలీ తీశారు. రేపటి ఆరోగ్యవంతమైన భారత సమాజం కొరకు ఇప్పటి యుక్త వయసు బాలబాలికలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు చక్కటి పోషకాహారం సమయానుకూలంగా అందించాలన్నారు. నిరంతరం పర్యవేక్షణ ద్వారా పోషకాహారం రక్తహీనతతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి అదనపు పోషకాహారం ఇవ్వాలన్నారు . రక్తహీనతకు చికిత్సను త్వరగా అందించాలని ఈ సందర్భంగా కోరారు.దీని కొరకు వారితో స్నేహపూర్వకంగా ఉంటూ ప్రభుత్వ పరంగా మనం అందించే పోషకాహారంతో పాటు వారి ఇంటిలోనే సొంతంగా ఆరోగ్యవంతమైన పోషకాహారం తయారు చేసుకోవడానికి చక్కటి పోషక విలువలు కలిగిన ఆకుకూరలు ,కాయగూరలు ఇంటిలోనే పెంచుకునే విధంగా ప్రోత్సహించడానికి కావాల్సిన సలహాలు, సూచనలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.