సూర్యాపేట కాల్పులపై సర్కారు సీరియస్‌

C

మృతులకు హోం మంత్రి నివాళి

ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు నాయిని, జగదీష్‌రెడ్డి

హైదరాబాద్‌/నల్లగొండ,ఏప్రిల్‌2(జనంసాక్షి):  సూర్యాపేటలో అర్థరాత్రి  కాల్పుల ఘటనపై తెలంగాణ సర్కారు సీరియస్‌గా ఉంది. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని డిజిపి సందర్శించారు. అలాగే ఘటనలో గాయపడి బేగంపేట కిమ్స్‌లో చికిత్స పొందుతున్న సీఐ మొగలయ్య, ¬ంగార్డు కిషోర్‌ను తెలంగాణ ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం ¬ం మంత్రి నాయిని విూడియాతో మాట్లాడుతూ… గాయపడిన పోలీసులకు ప్రాణాపాయం లేదని తెలిపారు. సూర్యాపేట ఘటనలో పోలీసుల వైఫల్యం లేదని స్పష్టం చేశారు. సాధారణ తనిఖీల సమయంలో ఇద్దరు దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారని వెల్లడించారు. ఇక దుండగుల కాల్పుల్లో మృతిచెందిన కానిస్టేబుల్‌ లింగయ్య, ¬ంగార్డు మహేశ్‌ కుటుంబాలకు ప్రభుత్వం తరపున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. యూపీకి చెందిన ఓ ముఠా రాష్ట్రంలో తిరుగుతున్నట్టు సమాచారం ఉందన్నారు. బెయిల్‌పై బయటికి వచ్చి ఇక్కడ నేరాలకు పాల్పడుతున్నారని, ఈ ముఠా హైదరాబాద్‌లో చాలా చోట్ల చోరీలకు పాల్పడుతోందన్నారు. కాల్పుల ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని తెలిపారు. దోపిడీ దొంగలను అరికట్టేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. నేరగాళ్లను అడ్డుకున్న పోలీసులను ఈ సందర్భంగా ¬ం మంత్రి అభినందించారు. సూర్యపేట కాల్పుల ఘటనా స్థలాన్ని ¬ంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పరిశీలించారు. దుండగుల కాల్పుల్లో మృతి చెందిన పోలీసు అమరవీరులకు మంత్రులు నివాళులర్పించారు. అనంతరం మృతి చెందిన పోలీసుల కుంటుంబాలను పరామర్శించిన మంత్రులు వారిని అన్ని విధాల ఆదుకుంటామని ప్రకటించారు.

సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన డీజీపీ

సూర్యాపేట హైటెక్‌ బస్టాండ్‌లో కాల్పులు జరిగిన ప్రదేశాన్ని తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ గురువారం ఉదయం పరిశీలించారు. అనంతరం బస్టాండ్‌లోని సీసీటీవీల్లో నమోదైన దృశ్యాలను పరిశీలించారు. కాల్పుల ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా నమోదు కాలేదని, దీనిపై లోతుగా అధ్యయనం చేసి వివరాలు సేకరిస్తామన్నారు. బస్టాండ్‌ ప్రాంగణంలో మొత్తం ఐదు సీసీ కెమెరాలు ఉన్నట్టు చెప్పారు. సూర్యాపేట హైటెక్‌ బస్టాండ్‌లో బుధవారం అర్థరాత్రి దుండగులు జరిపిన కాల్పుల్లో కానిస్టేబుల్‌, ¬ంగార్డు మృతిచెందగా, సీఐ, ¬ంగార్డ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి.స్థానిక అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగానే బస్టాండ్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారని తెలిపారు.  బస్సులో తనిఖీలు చేస్తుండగా ఇద్దరు అనుమానితులుగా కనిపించటంతో వారిని ప్రశ్నిస్తున్న సమయంలో ఈ కాల్పులు జరిగాయన్నారు. దుండగులు వాడిని తూటాలను బట్టి, ఏపీ, బీహార్కు చెందిన ముఠా సభ్యులుగా అనుమానిస్తున్నామన్నారు. 7.65 బుల్లెట్లను ఉత్తర భారతంలో కొన్ని ముఠాలు నాటు తుపాకుల్లో వాడుతుంటాయని అనురాగ్‌ శర్మ తెలిపారు. కాల్పులు జరిపిన ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు ఆయన చెప్పారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, ఈ కాల్పుల వెనుక మావోయిస్టుల హస్తం ఉందనుకోవటం లేదని అనురాగ్‌ శర్మ తెలిపారు. అలాగే చనిపోయిన పోలీసుల కుటుంబాలను ఆదుకుంటామని హావిూ ఇచ్చారు. సీఐ మొగులయ్య కోలుకుంటున్నారని తెలిపారు. పోలీసులపై కాల్పులు జరిపిన ముఠా పారిపోతూ అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి హైదరాబాద్‌ వెళుతున్న జెడ్పీటీసీ దొరబాబు వాహనంపై కూడా కాల్పులకు పాల్పడినట్లు డీజీపీ తెలిపారు.  ఆయన భుజంలోకి తూటా దూసుకు  వెళ్లిందని ప్రస్తుతం  హైదరాబాద్‌ లో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బలగాలను రప్పించామని, దుండగులు యూపీ, బీహార్‌ వాసులుగా అనుమానిస్తున్నట్టు చెప్పారు. దుండగుల కాల్పుల్లో మృతిచెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.25లక్షలు, ¬ంగార్డు కుటుంబానికి రూ.10లక్షల పరిహారం అందిచనున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్టు వెల్లడించారు.

సీఐ శరీరంలోబుల్లెట్లు : కిమ్స్‌ వైద్యులు

కాల్పుల ఘటనలో గాయపడిన సీఐ మొగలయ్య శరీరంలో రెండు బుల్లెట్లు ఉన్నాయని కిమ్స్‌ వైద్యులు తెలిపారు. ఛాతి, స్పైనల్‌ కార్డ్‌ వద్ద బుల్లెట్లు ఉన్నాయని, వాటిని తొలగించేందుకు శస్త్రచికిత్స చేస్తున్నామన్నారు. ¬ంగార్డు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు.  సీఐ మొగులయ్య, ¬ంగార్డు కిశోర్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని డాక్టర్‌ భాస్కర్‌రావు తెలిపారు. సీఐ శరీరంలో ఉన్న రెండు బుల్లెట్లను ఆపరేషన్‌ చేసి తొలగిస్తామని ఆయన  చెప్పారు.   సీఐ శరీరంలో బుల్లెట్లు దూసుకు పోవటంతో లివర్‌, కిడ్నీ ఎంతవరకూ దెబ్బతిన్నాయనే విషయం ఇంకా తెలియదన్నారు. ఆపరేషన్‌ చేసేటప్పుడు ఆ విషయం తెలుస్తుందన్నారు. ఇక  ¬ంగార్డు కిశోర్‌ బాడీలో ఉన్న బుల్లెట్లు బయటకు వచ్చేశాయని డాక్టర్‌ భాస్కర్రావు తెలిపారు.  ప్రస్తుతం వారిద్దరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పారు. గాయపడినవారిని మొదట సూర్యాపేటలోని మెట్రో ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.