సూర్యాపేట కాల్పుల నిందితుల హతం
వీరోచితంగా పోరాడిన నల్గొండ పోలీసులు
3 రోజుల్లో ముగ్గురు పోలీసుల బలిదానం
సిమి కార్యకర్తలుగా నిఘా వర్గాల అనుమానం
నల్లగొండ,ఏప్రిల్4(జనంసాక్షి): నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ లో సూర్యాపేట కాల్పుల నిందితులు హతమయ్యారు. ఈ ఎన్‌కౌంట్‌ర్‌లో ఓ పోలీస్ యువకిశోరం కూడా దుండగుల కాల్పుల్లో నేలకొరిగాడు. అచ్చు సినిమాను తలపించేలా దుండగులను వేటాడి చంపడంలో అత్యంత ధైర్యసాహసాలను పోలీసులు ప్రదర్శించారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారిని వెన్నాడి మట్టుపెట్టారు. ఈ పోరులో ఓ యువపోలీస్ బలికావడం విషాదం. పోలీసులు అడవుల్లో గుట్టల్లో పడి పరుగెత్తి పోలీసులను నానా ముప్పుతిప్పలు పెట్టినా వారు అలసిపోలేదు. ప్రాణాలు పోతాయన్న భయంతో వెనుదిగరలేదు. అత్యం ధైర్యసాహసాలు ప్రదర్శించి దుండగులను అంతమొందించారు. ఇందుకు గ్రాస్థులు కూడా సహకరించి తమవంతుగా రుణం తీర్చుకున్నారు. ఏప్రిల్ 1న రాత్రి ఇద్దరు పోలీసులను పొట్టనపెట్టుకున్న దుండగుల వేటలో గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు జానకీపురం వద్ద వారిని వేటాడి వెంటాడి మట్టుపెట్టారు. పోలీసులు, దుండగులుకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు దుండగులు హతమయ్యారు. దుండగుల కాల్పుల్లో నాగరాజు అనే కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతిచెందగా, సీఐ బాలగంగిరెడ్డి, ఎస్.ఐ సిద్దయ్యలకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ పోలీసులను హుటాహుటిన ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన దుండగులు సూర్యాపేట కాల్పుల ఘటనలో నిందితులుగా నిర్థరించారు. మృతులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన అక్రమ్ అయూబ్, జాకీర్ బద్రూన్‌గా గుర్తించారు. సూర్యపేటలో ఓ సీఐ, ¬ంగార్డులను కాల్చి చంపి పరారైన దొంగలను పట్టుకోడానికి జిల్లాలో పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అర్వపల్లి గ్రామం శివారు దర్గాలో నిందితులు నిద్రిస్తున్నట్టుగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారిని చూసిన ఇద్దరు నిందితులు పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో అర్వపల్లి మండల కేంద్రం వైపు పరుగు తీశారు. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ఉదయం నుంచి వేట కొనసాగించారు. తొలుత నల్గొండ జిల్లా సీతారాంపురంలో దోపిడీ దొంగలు సంచరిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దుండగులు పోలీసులపై కాల్పులకు దిగడంతో పోలీసులు- దొంగల మధ్య 6 రౌండ్లు కాల్పులు జరిగాయి. కాల్పుల తర్వాత మండల కేంద్రమైన అర్వపల్లి చేరుకున్న ఇద్దరు దుండగులు లింగమల్లు అనే వ్యక్తిని తుపాకీతో బెదిరించి అతని ద్విచక్రవాహనం లాక్కుని జనగాం వైపు పరారయ్యారు. పోలీసులు వెంబడించడం గమనించిన దుండగులు డి.కొత్తపల్లి గుట్టల్లోకి పరారయ్యారు. పోలీసులు డి.కొత్తపల్లి చేరుకోవడంతో అక్కడి నుంచి మోత్కూరు మండలం జానకీపురం వెళ్లారు. జానకీపురంలో పోలీసులు, దుండగుల మధ్య కాల్పులు జరిగాయి. లొంగిపొమ్మన్నా వినకుండా వారిని అనుసరించిన పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులు కూడా వారిపై ఎదురు కాల్పులు జరిపారు. రెండు గంటలుగా వారి మధ్య ¬రా¬రి ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ దుర్ఘటనలో ఆత్మకూరు(ఎం) కానిస్టేబుల్ నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ ఎస్‌ఐ సిద్ధయ్య, సీఐ బాలగంగిరెడ్డిలను ఆసుపత్రికి తరలించారు. మరణించిన ఇద్దరు దుండగులను ఉత్తర ప్రదేశ్ రాష్టాన్రికి చెందిన అస్లం అయూబ్, జాకీర్ బద్రూన్‌గా గుర్తించారు. వీరికి ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలాన్ని డీజీపీ అనురాగ్ శర్మ పరిశీలించారు.
మూడురోజుల తేడాతో ముగ్గురు బలి
మూడు రోజుల తేడాలోనే తమ వారిని ముగ్గురిని కోల్పోవడంతో నల్లగొండ పోలీసులు కన్నీటి పర్యంతమయ్యారు. సూర్యపేట కాల్పుల నిందితులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆత్మకూరు(ఎం) పోలీసు స్టేషన్ ఎస్‌ఐ సిద్ధయ్యకు గాయాలు కాగా, కానిస్టేబుల్ నాగరాజు దుర్మరణం చెందడంతో స్థానిక ప్రజలు విషాధంలో మునిగిపోయారు. కానిస్టేబుల్‌తో తమకున్న అనుబంధాన్ని పలువురు గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందుతున్నారు. 2007లో ఇదే పోలీసు స్టేషన్‌పై నక్సలైట్లు దాడి చేసి అప్పటి ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, ¬ంగార్డులను అతి కిరాతకంగా చంపిన చేదు జ్ఞాపకల్ని నెమరు వేసుకుంటున్నారు. బరువెక్కిన హృదయాలతో ప్రజలు పోలీసు స్టేషన్ వద్ద గుమిగూడారు. అక్కడ విషాధ వాతావరణం నెలకొని వుంది.
ఎన్‌కౌంటర్ దుండగులు గుర్తింపు
నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం సవిూపంలో ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన దుండగులు సూర్యాపేట కాల్పుల ఘటనలో నిందితులుగా నిర్థరించారు. మృతులు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అక్రమ్ అయూబ్, జాకీర్ బద్రూన్‌గా గుర్తించారు. ఘటనాస్థలంలో ఒక కార్బైన్, రెండు పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని డిజిపి అనురాగ్ శర్మ ధృవీకరించారు. వారు కాల్పులు చేసిన లోకల్ మేడ్ తుపాకీ ఆధారంగా గుర్తించామన్నారు. నల్గొండ జిల్లా ఎస్పీ భాకారరావు జానకీపురం చేరుకుని పరిస్థితిని సవిూక్షించారు. ఎన్‌కౌంటర్ ఘటనతో జానకీపురం వాసులు ఉలిక్కిపడ్డారు. ప్రశాతంగా ఉన్న గ్రామంలో ఉదయం ఒక్కసారిగా కాల్పులు చోటు చేసుకోవడంతో ఆందోళనకు గురయ్యారు. కాగా మోత్కూరు మండలం జానకీపురం వద్ద ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ పరిశీలించారు. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు దుండగులు, కానిస్టేబుల్ మృతి చెందగా, సీఐ, ఎస్‌ఐలకు తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. ఎన్‌కౌంటర్ జరిగిన వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు . సూర్యాపేటలో కాల్పులు జరిపిన దుండగులే ఇవాళ హతమయ్యారని నిర్ధారించారు. వీరు సిమి ఉగ్రవాద సంస్థ కార్యకర్తలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సూర్యాపేట కాల్పుల ఘటనలో, ఇవాళ ఒకే ఆయుధం వాడారని డీజీపీ స్పష్టం చేశారు. ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన సీఐ బాలగంగిరెడ్డి, ప్రొబేషనరీ ఎస్.ఐ సిద్దయ్యలకు హైదరాబాద్ ఎల్బీనగర్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఎస్.ఐ సిద్దయ్య తల, ఛాతి, పొట్టభాగాల్లో బుల్లెట్లు దూసుకెళ్లినట్టు వైద్యులు తెలిపారు. సిద్దయ్యకు శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని వెల్లడించారు. సీఐ బాలగంగిరెడ్డి ఆరోగ్య పర్థసితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.