సెప్టెంబర్‌ 17 ముమ్మాటికీ విలీన దినమే

4

– అరిచి గీ పేడితే అదిరేదిలేదు

– వెంకయ్యకు జ్ఞానోదయం కావాలి

– ఎంపీ కవిత

కరీంనగర్‌,సెప్టెంబర్‌ 3(జనంసాక్షి): సెప్టెంబర్‌ 17 వతేదీ విషయంలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అయిన వెంకయ్య నాయుడు తెలంగాణ విమోచన దినంగా జరపాలని డిమాండ్‌ చేయడం ఆయన పరిణతికి అద్దం పడుతుందని నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. దీనివల్ల హిందూ ముస్లింల మద్య సఖ్యత దెబ్బతింటుందన్నారు. తెలంగాణా సమాజాన్ని విడగొట్టాలని చూసే బీజేపి చర్యలను తాము అంగీకరించేది లేదన్నారు. తాము ఎప్పటినుంచో విలీన దినాన్ని నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ భవన్‌లో ప్రతియేటా విలీన దినం జరుపుతున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. విలీన దినంపై అనవసర రాద్దాంతాలు మానుకోవాలని ఆమె బిజెపి నేతతలకు చురకలంటించారు. తెలంగాణా సర్కార్‌కు గత పాలకులకంటే సోయి, చిత్తశుద్ది అధికంగా ఉందని, ప్రజల అవసరాలేంటో బాగా తెలుసునని ప్రతిపక్షాలు అరిచి గీపెట్టినా… ఆందోళనలు చేస్తే అదిరిపోతాం బెదురుతామనుకుంటే పూర్తిగా వారి అవివేకమే అవుతుందని నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రజల అవసరాలు, వారి ప్రాధాన్యాలు బాగా తెలిసిన వ్‌య్తి సిఎం కెసిఆర్‌ అన్నది గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికైనా డికె అరుణతోపాటు ఇతరులంతా నోళ్లుమూసుకోకుంటే మాత్రం నయాపైసా నిధులిచ్చేది లేదని  తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానించారు. శనివారం జగిత్యాల నియోజకవర్గంలోని సారంగపూర్‌ మండలంల కమ్మునూర్‌, తాల్ల ధర్మారంలకు చెందిన 37 మంది దళిత లబ్దిదారులకు మూడెకరాల భూమిపంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపి మాట్లాడుతూ తెలంగానా లో అబివృద్ది కుంటు పడిందని చెప్పే ప్రతిపక్షాలు సారంగపూర్‌ వచ్చి చూస్తే కనిపిస్తుందన్నారు. మూడు కోట్ల 37లక్షలు వెచ్చించి భూమిని కొనుగోలు చేసి ఒక్కొక్కరికి 9 లక్షల విలువైన భూమిని పంపిణీ చేస్తున్నామన్నారు. దీనిని వినియోగించుకుని అభివృద్ది పథంలోకి రావాలన్నారు. గద్వాల కోసం ఆమరణ దీక్షలను విరమించుకోవాలని హితవు పలికారు. ప్రజలను తప్పుదారి పట్టించే పనులు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈసందర్బంగా దళిత మహిళలతో ఎంపి కవిత, జిల్లా కలెక్టర్‌ నీతూప్రసాద్‌, జగిత్యాల సబ్‌ కలెక్టర్‌ శశాంక తదితరులు సహపంక్తి భోజనం చేశారు.