సేవ చేసే అవకాశం ఇవ్వండి

4

– అస్సోం ఎన్నికల సభలో మోదీ

గువాహటి,మార్చి26(జనంసాక్షి):స్వాతంత్య్రం వచ్చినప్పుడు అసోం అత్యంత సంపన్నమైన రాష్ట్రంగా ఉండేదని, కానీ ఇప్పుడు ఆ రాష్ట్రం అత్యంత నిరుపేదగా మిగిలిపోయిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పోరాటం పేదరికం, అవినీతిపైనే కానీ అసోం సీఎం తరుణ్‌ గొగోయ్‌పై కాదని ఆయన అన్నారు. అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రధాని మోదీ శనివారం ప్రచార శంఖారావాన్ని పూరించారు. అసోంలోని తిన్‌సుఖియా, మజులి, బిహ్‌పురియా, బొకాఖట్‌, జొహ్రాత్‌లోని ఐదుచోట్ల ఎన్నికల ప్రచార సభల్లో మోదీ పాల్గొననున్నారు. ఈ నెల 27న రంగపరా, కరీంగంజ్‌ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.ఇందులో భాగంగా తిన్‌సుకియా ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడారు. ఆయన ప్రసంగంలోకి కీలక వ్యాఖ్యలివి.మంచి చేస్తుందనే ఉద్దేశంతో విూరు కాంగ్రెస్‌కు 60 ఏళ్లు అవకాశమిచ్చారు. మాకు కేవలం ఐదేళ్లు అవకాశం ఇవ్వండి చాలు. సంపూర్ణ అసోం అభివృద్ధి అజెండా. దానిని చేసి చూపిస్తాం.అసోం ఎన్నికలు నాకు వ్యక్తిగతంగా నష్టమే. ఎందుకంటే అత్యంత సమర్థుడైన కేంద్రమంత్రి సర్వానంద్‌ సోన్‌వాల్‌ (బీజేపీ సీఎం అభ్యర్థి)ను నేను ప్రచారం కోసం పంపాల్సి వస్తుంది.అయితే ఇది అసోంకు తప్పక మేలు చేస్తుంది. అసోంలో ప్రస్తుతమున్న తరంగం, ప్రస్తుతమున్న ఆనందం ఒక్కటే. అది సర్వానంద్‌.పేరుకు మాత్రం ‘తిన్‌సుఖియా’ ప్రాంతం. కానీ ఎక్కడా చూసిన దుఃఖమే కనిపిస్తోంది. మా సంకల్పం ఒక్కటే. స్వచ్ఛమైన అర్థంలో ‘తిన్‌సుఖియా’ను సుఖవంతమైన ప్రదేశంగా మారుస్తాం. ప్రజలను సుఖంగా చూసుకుంటాం.