సొంత నియోజకవర్గంలో మోదీ పర్యటన

3

వారణాశి,ఏప్రిల్‌ 30(జనంసాక్షి):ప్రధాని నరేంద్రమోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాశిలో ఆదివారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ యూపీలోని బబత్‌పూర్‌ ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. అక్కడి నుంచి బలియా వెళ్లి.. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ప్రధాని మోదీ వారణాశి బయలుదేరుతారని అధికారులు వెల్లడించారు. అస్సీ ఘాట్‌ వద్ద సోలార్‌ పవర్‌ బోట్లను మోదీ ప్రారంభిస్తారు. అంతేగాక.. లబ్దిదారులకు 1000 ఈ రిక్షాలను కూడా పంపిణీ చేయనున్నారు.పర్యటనలో భాగంగా సామ్నే ఘాట్‌ వద్ద ఉన్న ‘జ్ఞానప్రవాహ’ కేంద్రాన్ని మోదీ సందర్శించనున్నారు. 1997లో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. పురాతన పుస్తకాలు, అరుదైన కళాఖండాలు ఈ కేంద్రంలో కొలువుదీరాయి. ఈ ఏడాదిలో ప్రధాని మోదీ వారణాశిలో పర్యటించడం ఇది మూడోసారి.