స్మార్ట్‌సిటీలకు శ్రీకారం

5

– పుణెలో ప్రారంభించిన ప్రధాని మోదీ

ముంబయి,జూన్‌ 25(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పుణె వేదికగా స్మార్ట్‌ సిటీస్‌ అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. పుణెలో 14 ప్రాజెక్టులను, దేశ వ్యాప్తంగా ఇతర స్మార్ట్‌ సిటీస్‌లలో 69 ప్రాజెక్టులను ప్రారంభించారు. రూ. 1,770 కోట్ల వ్యయంతో వివిధ ప్రాజెక్టులను కేంద్రం చేపట్టింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, ప్రకాశ్‌ జవదేకర్‌, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ హాజరయ్యారు. గతంలో నగరీకరణను శాపంగా భావించేవాళ్లమని, ప్రధాని మోదీ దీనిని అవసరంగా భావించారని మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ అన్నారు. శనివారం పుణెలో ఆకర్షణీయ నగరాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా సీఎం ఫడణవీస్‌ మాట్లాడుతూ.. ఆకర్షణీయ నగరాల ప్రాజెక్టును ప్రారంభించేందుకు పుణెను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖనగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం పుణెలో ఆకర్షణీయ నగరాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విశాఖలో చేసిన అభివృద్ధి పనులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మోదీతో సహా కార్యక్రమానికి విచ్చేసిన వారికిసీఎం చంద్రబాబు వివరించారు. ‘విశాఖను స్మార్ట్‌సిటీగా ఎంచుకున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.  18 నెలల క్రితం హుద్‌హుద్‌ వల్ల నగరంలో భారీ నష్టం జరిగింది. దాని నుంచి కోలుకుని నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామన్నారు.