స్వచ్ఛత పై అవగాహనా ర్యాలీ

శ్రీరంగాపురం:సెప్టెంబర్ 19 (జనంసాక్షి):
శ్రీరంగాపురం మండలం తాటిపాముల గ్రామంలో
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్  02 వరకు నిర్వహించే స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు తాటిపాముల గ్రామ పంచాయతీ  పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్తచెదారం ( పిచ్చి మొక్కలు) తీసివేయడం.గ్రామ ప్రజలకు తడి/పొడి చెత్త నిర్వహణ పై అవగాహన కల్పించడం జరిగింది.నీటి వనరుల సమీపంలోని ప్రాంతాలను శుభ్రపరుచడం మరియు వాటి చుట్టూ  మొక్కలను నాటించడం.బహిరంగ ప్రదేశాలలో చెత్తను వేయకుండా అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.ఒకసారి వాడిపాడేసే ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాల గురించి అవగాహనా కలిగించడం కోసం గోడ రాతలు రాపియడం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, సత్యం యాదవ్ ఎంపీటీసీ, పార్వతమ్మ వెంకటయ్య ఎంపీడీఓ,ఎంపీఓ, ఎపిఎం, జిల్లా యస్.బి.ఎం కన్సల్టెంట్,ఏ పి ఓ, పి స్, ఏ పి ఎం , అంగన్వాడి ఆశ కార్యకర్తలు  తదితరులు పాల్గొనడం జరిగింది.