స్వలింగ సంపర్కం నేరంకాదు

1

– ఆర్‌ఎస్‌ఎస్‌ కీలక ప్రకటన

న్యూ ఢిల్లీ,మార్చి18(జనంసాక్షి):స్వలింగ సంపర్కంపై రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) కీలక ప్రకటన చేసింది. ఎప్పుడూ ఈ వ్యవహారాన్ని వ్యతిరేకించే ఆర్‌.ఎస్‌.ఎస్‌ తన వైఖరి మార్చుకోవటం విశేషం. పైగా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరాదన్న డిమాండ్‌ కు మద్దతునిచ్చింది. ఇతరుల జీవితాలపై దుష్ప్రభావం పడనంత వరకు స్వలింగ సంపర్కం నేరం కాదని స్పష్టం చేసింది. ఇండియా టుడే కాంక్లేవ్‌ లో ఆరెస్సెస్‌ సంయుక్త కార్యదర్శి దత్తాత్రేయ ¬సబాలే ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. ¬మో సెక్సువాలిటీపై ఆరెస్సెస్‌ కు ఓ అభిప్రాయం ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. ఈ చర్య నేరం కానప్పటికీ అనైతికమని చెప్పారు. ఇతరుల జీవితాలపై ప్రభావం చూపనంత వరకు అది నేరం కాదని? లైంగిక వ్యవహారాలు వ్యక్తిగత అంశాలని చెప్పారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌ తాజా ప్రకటనతో ¬మో సెక్సువల్స్‌ సంతోషం వ్యక్తం చేశారు.