హజ్ యాత్రికుల కోటా పెంచండి
-కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ
హైదరాబాద్ మార్చి 22 (జనంసాక్షి):
తెలంగాణ నుంచి హజ్‌కు వెళ్లేవారి సంఖ్యను దృష్టిలో పెట్టుకొని తమ రాష్ట్రానికి హజ్ యాత్రికుల కోటా పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కేంద్రానికి లేఖ రాశారు. ఉమ్మడి రాష్ట్రం కంటే ప్రస్తుతం రాష్ట్రానికి హజ్ కోటా తగ్గిందని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీకి కలిపి 4945 మందికే హజ్ యాత్రకు అనుమతి ఇచ్చారు.ఈ కోటాను పెంచాలని విజ్ఞప్తి చేస్తూ విదేశాంగ శాఖ మంత్రి మంత్రి సుష్మా స్వరాజ్‌కు కేసీఆర్ లేఖ రాశారు. అదనంగా మరో
రెండు వేల మందికి హజ్ యాత్రకు అనుమతి ఇవ్వాలని ఆయన ఆ లేఖలో కోరారు.