హసన్‌పర్తి లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం త్రివర్ణ పతాక ఆవిష్కరణ.
జనం సాక్షి హసన్‌పర్తి :
హసన్‌పర్తి 66వ డివిజన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మేకల హరిశంకర్ ఆధ్వర్యంలో హసన్‌పర్తి సెంట్రల్ జాతీయ రహాదారి యందు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకావిష్కరణ చేసారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కార్పోరేటర్ గురుమూర్తి శివన్న, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి,అమరులకి పూలమాల వేసి నివాళులు అర్పించి జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్పొరేటర్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వం వహించి నాడు పోలీసు చర్య జరిపిన ఘనత సర్దార్ పటేల్ గారిది,నేడు అభినవ సర్దార్ కేంద్ర హోంమంత్రివర్యులు అమీత్ షా కేంద్ర బలగాలతో అంగరంగవైభవెంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం తెలంగాణా ప్రజలుగా గర్వపడాల్సిన అవసరం మనకుంది అని,నాడు నిజాం ప్రభువు రజాకార్ల చేతిలో తెలంగాణ ప్రజలు చిత్ర హింసలు పడి,మహిళలు మాన, ప్రాణాలను పోగొట్టుకోవడం జరిగింది.తెలంగాణా ప్రజల ఆత్మ గౌరవాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్ మంటగలిపి మునుపు ఎన్నడూ చేయని తెలంగాణా విమోచన దినోత్సవాన్ని ఎన్నికలు దగ్గరకు రాగానే ప్రజల ఆలోచనని మళ్లించడానికి కేవలం బీజేపి నాయకులు అంటే భయంతో బీజేపికి భయపడి జాతీయ సమైక్యతగా పేరుగాంచడం భాదాకరమని అన్నారు,కేసీఆర్ కేవలం ఓటు బ్యాంకింగ్ కోసం ఎమ్ఐఎమ్ కి వత్తాసుబలికుతున్నాడని,తెలంగాణా పోరాటంలో నాడు ముస్లింలు సైతం పోరాటంచేసి ప్రాణ త్యాగాలు చేసారని,నాడు హసన్‌పర్తి గడ్డ నుండి ఆర్యసమాజిస్టిలు,అనేకులు తెలంగాణాలో విరోచిత పోరాటం చేసారని గుర్తుచేసారు. ఈ కార్యక్రమంలో భాజపా హనుమకొండ జిల్లా కార్యదర్శి గుండమీది శ్రీనివాస్,సీనియర్ నాయకులు మారపెల్లి రాంచంద్రా రెడ్డి,తాళ్ల రమేష్,గంట సత్యం,దాసరి రాజు,బీజేవైయం జిల్లా ప్రదాన కార్యదర్శి తాళ్ల శ్యాంసుందర్,బీజేవైయంజిల్లా కార్యదర్శి కందుకూరి సాయి చందు,మహిళామోర్చ జిల్లా కార్యదర్శి గరిగె మాదవి,డివిజన్ ప్రదాన కార్యదర్శి తంగెళ్లపెల్లి రమేష్,ఉపాధ్యక్షులు మీసరకొండ సత్యనారాయణ,బండారి శేఖర్,వేల్పుల చిన్న రమేష్,డివిజన్ యువమోర్చ అధ్యక్షులు పోలెపాక నిశాంత్,మహిళా మోర్చ డివిజన్ అధ్యక్షురాలు గోడిశాల లలిత,ఓబీసి మోర్చ ఉపాధ్యక్షులు దాది మదుసుదన్,కిసాన్ మోర్చ ఉపాధ్యక్షులు పార్శ సతీష్,డివిజన్ కార్యదర్శి దాట్ల సునీల్,వెలిగేటి తిరుపతి రెడ్డి,గుడికందుల సాంబయ్య,నాయకులు పోతరాజు ప్రభాకర్,వలుస రాజేంద్రం,మారం తిరుపతి,మహేంద్రా చారి,గుడికందుల క్రాంతి,చెన్నూరి రవి,ఆర్మీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.