హామీ పత్రాలిచ్చి వాహనాలు నడుపుకోండి

3

ట్రావెల్స్‌ అసోసియేషన్‌ పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్‌,ఏప్రిల్‌1(జనంసాక్షి): ఏపీ ప్రైవేటు వాహన యజమానులకు ఊరట లభించింది.  రవాణాపన్నుపై ప్రైవేటు ట్రావెల్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంట్రీ ట్యాక్స్‌ వారం పాటు వసూలు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చెక్‌ పోస్టుల వద్ద హావిూ పత్రాలు ఇవ్వాలని సూచించింది. తెలంగాణ చెక్‌పోస్టుల వద్ద హావిూ పత్రాలు ఇవ్వాలని పిటిషనర్లకు సూచించింది. ఎంపీ కేశినేని నాని తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ ను విచారించిన ధర్మాసనం ఈ ఆదేశాల్చింది. కోర్టును ఆశ్రయించిన వారు తప్ప మిగతా వారంతా ఎంట్రీ ట్యాక్స్‌ కట్టాల్సిందేనని న్యాయస్థానం పేర్కొంది. దీనిపై తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.  పిటిషన్‌ దాఖలు చేసిన వారికే వర్తించేలా హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది.రవాణాపన్ను వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రైవేటు ట్రావెల్స్‌ అసోసియేషన్‌ హైకోర్టులో పేర్కొంది. తమ విజ్ఞప్తిని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయని వారు న్యాయస్థానానికి తెలిపారు. జీవో నంబరు 15ను రద్దు చేయాలని కోర్టును అభ్యర్థించారు.