హిందీ సేవి సమ్మాన్‌ అవార్డుల ప్రదానం

3

న్యూదిల్లీ,ఏప్రిల్‌ 19(జనంసాక్షి):దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో హిందీ సేవి సమ్మాన్‌ యోజన అవార్డుల ప్రదాన కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.జార్జ్‌ గ్రేసన్‌, గంగశరణ్‌ పురస్కార్‌, మోటూరి సత్యనారాయణ అవార్డుతో పాటు హిందీసేవి సమ్మాన్‌ అవార్డులను విజేతలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అందజేశారు. హిందీ భాష అధ్యయనం, వ్యాప్తికి కృషి చేసిన హిందీ భాషా పండితులకు ఈ అవార్డులను ప్రకటించారు. 2012, 13, 14 సంవత్సరాలకు గాను ఇవాళ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.