హుషారుగా హోళీ వేడుకలు

5A

 

5B
సీఎం క్యాంప్‌ ఆఫీసులో కేసీఆర్‌ హోలీ సంబరాలు

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ రంగుల కేళీ

హైదరాబాద్‌/న్యూఢిల్లీ,మార్చి6(జనంసాక్షి): దేశవ్యాప్తంగా ¬లీ వేడుకలు అంబరాన్ని అంటాయి. చిన్న..పెద్దా..ఆడ..మగ..తేడా లేకుండా అంతా ¬లీ రంగుల్లో మునిగి తేలారు. దేశంలోని అన్ని ప్రాంతాలు, నగరాలు పూర్తిగా రంగులు మయమయ్యాయి. హైదరాబాద్‌ సహా ముంబాయి, యూపీ, రాజస్థాన్‌, నాగ్‌పూర్‌, తదితర నగరాల్లో ¬లీ వేడుకలు అంబరాన్ని అంటాయి. ఆర్మీ సిబ్బంది డప్పులూ వాయిస్తూ ¬లీ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలు ఆర్మీ సిబ్బందికి రంగులు పూస్తూ ¬లీ శుభాకాంక్షలు తెలిపారు. కోల్‌కతాలో మహిళలు సంప్రదాయబద్ధమైన నృత్యాలు చేశారు. సంప్రదాయబద్దంగా సాగిన ఈ వేడుకల్లో పిల్లలు, పెద్దలు, మహిళలు హుషారుగా పాల్గొన్నారు. తెల్లవారుజామున పలు నగరాల్లో కామదహనం చేశారు. ఒకరినొకరు రంగులు చల్లుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ¬లీ జోష్‌తో యువత ఆటపాటలతో పండుగను కలర్‌ఫుల్‌ చేశారు. కేంద్ర ¬ం మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ కు రంగులు పూయడానికి నేతలు, కార్యకర్తలు, అభిమానులు క్యూ కట్టారు. దిల్లీలోని భాజపా కార్యాలయంలో ¬లీ సంబరాలు అంబరాన్నంటాయి. కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, శాస్త్ర, ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌లు కార్యకర్తలతో కలిసి ¬లీ ఆడారు. ¬ంమంత్రి అయితే డప్పులు వాయించి సందడి చేశారు. దిల్లీ భాజపా అధ్యక్షుడు సతీశ్‌ ఉపాధ్యాయ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అలాగే దిల్లీ అశోక్‌ రోడ్డులో జరిగిన మరో కార్యక్రమంలో జేపీ నడ్డా తదితర కేంద్ర మంత్రులు, భాజపా ప్రముఖులు పాల్గొన్నారు. ఉజ్జయినిలోని ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువతి, యువకులు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. కఒరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ¬లీని ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. దీంతో రోడ్లన్నీ రంగులమయమయ్యాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబసభ్యులతో కలిసి క్యాంప్‌ ఆఫీస్‌లో హోళీ సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాసంలో ¬లీ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులతో కలిసి ¬లీ సంబరాల్లో పాల్గొన్నారు. ఆయన కోడుకు మంత్రి కెటిఆర్‌, మనవడితో కలసి వేడుకల్లో పాల్గొన్నారు. జంటనగరాల్లో అన్ని వర్గాల ప్రజలు ఆనందోత్సహాలతో ¬లీ వేడుకలు జరుపుకున్నారు.  తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ¬లీ వేడుకల్లో భాగంగా  సనత్‌నగర్‌ జెక్‌ కాలనీలో జరిగిన ¬లీ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. అందరితో కలిసి ఆడుతూ… పాడుతూ ఆకట్టుకున్నారు. కాలనీవాసులతో కలిసి సరదాగా గడిపారు. మంత్రి తమ కాలనీకి రావడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ¬లీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. యువత పెద్ద ఎత్తున చేరుకోవడంతో ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

మరోవైపు హైదరాబాద్‌ ఇందిరాపార్కులో జరిగిన వేడుకల్లో కేంద్రమంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు. ఉల్లాసంగా ఆడిపాడి ఒకరికొకరు రంగులు పూసుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ¬లీ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. మరోవైపు  రాజ్‌భవన్‌లో ¬లీ సంబరాలు ఘనంగా జరిగాయి. గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌, విద్యార్థులు ¬లీ  వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు గవర్నర్‌ ¬లీ శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్‌ సతీమణి విమలా నరసింహన్‌ కూడా వేడుకల్లో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌భవన్‌కు వచ్చిన పాత్రికేయులకు అధికారులకు దంపతులిద్దరూ రంగులు పూసి ఎంజాయ్‌ చేశారు. ¬లీ అంటే పాత కష్టాలు పోయి కొత్త సంతోషాలు వస్తాయనే అర్థమని ఉభయ గవర్నర్‌ నరసింహన్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు ¬లీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలకు మంచి రావాలని, కొత్త సంతోషాలు వస్తాయన్నారు. ఇరు రాష్టాల్ల్రో నెలకొన్న సమస్యలపై విలేకరులు ప్రస్తావించగా ‘ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు వస్తాయి…దీనివల్ల రిలేషిన్‌ షిప్‌ పాడవదు కదా’ ? అని పేర్కొన్నారు. ప్రజల కోసమే ప్రభుత్వాలున్నాయన్నారు. రాష్ట్ర ప్రజలకు ¬లీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు, అలాగే మార్చి ఎనిమిదవ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు గవర్నర్‌ సతీమణి తెలిపారు.