హెచ్‌ఆర్‌డీ మంత్రి సర్టిఫికెట్లు దొరకలేదట!

1

– ఆమె డిగ్రీలపై అనుమానమే

దిల్లీ,మే3(జనంసాక్షి): ఆమె భారదేశానికి మానవ వనరుల శాఖ మంత్రి… కానీ ఆమె బీఏ చదువుకున్న సర్టిఫికెట్లు మాత్రం  దొరకలేదట! వివరాల్లోకి వెళితే..కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ బీఏ పట్టాకు సంబంధించిన పత్రాలు ఇంకా దొరకలేదని దిల్లీ యూనివర్శిటీ తెలిపింది. 1996 నాటి ఆమె పత్రాలు, స్మృతి అందించిన 12వ తరగతి సర్టిఫికెట్ల ఇంకా దొరకలేదని యూనివర్శిటీ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ స్కూల్‌ ఆఫ్‌ ఓపెన్‌ లెర్నింగ్‌ ఓఎపీ తన్వాల్‌ కోర్టుకు తెలిపారు.2004 లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆమె 1996లో దిల్లీ యూనివర్శిటీ నుంచి బీఏ కోర్సు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. అయితే అది తప్పుడు అఫిడవిట్‌ అని దిల్లీ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పత్రాలను సమర్పించాల్సిందిగా దిల్లీ యూనివర్శిటీకి సమన్లు జారీ చేసింది. దీనిపై స్పందించిన వర్శిటీ పై విధంగా వివరణ ఇచ్చింది. జూన్‌ 6న దీనిపై తదుపరి విచారణను న్యాయస్థానం చేపట్టనుంది.