హెచ్‌సీయూ ఘటనపై జాతీయహక్కుల కమీషన్‌ సిరియస్‌

1

– సూమోటోగా కేసు నమోదు

– చర్లపల్లి జైల్లో విద్యార్ధి నేతల పరామర్శలు

ఢిల్లీ మార్చి25 (జనంసాక్షి):

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో విద్యార్థులకు నిత్యవసరాలైన

ఆహారం, నీరు, విద్యుత్తు అందకుండా చేయడం ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది. మానవవనరుల మంత్రిత్వశాఖ, తెలంగాణ చీఫ్‌ సెక్రటరీ, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ లకు నోటీసులు జారీ చేసింది.ఆ ఘటనపై వారంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విద్యార్థుల వ్యవహారంలో పోలీసులు, పాలకమండలి వైకరిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం చెందింది. విద్యార్థులకు ఆహారం,

నీరు, విద్యుత్తు అందకుండా చేయడంపై కమిషన్‌ సీరియస్‌ గా ఉన్నట్లు తెలుస్తోంది. అత్యవసరి పరిస్థితి తలెత్తిందని కమిషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది.కాగాచర్లపల్లి జైలులో ఉన్న హెచ్‌సీయూ ప్రొఫెసర్లు, విద్యార్థులను వివిధ పార్టీల నేతలు పలకరించి, మద్దతు పలికారు. శుక్రవారం ఉదయం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆ పార్టీ నేత శ్రవణ్‌కుమార్‌ అరెస్టైన విద్యార్థులను, అధ్యాపకులను పలకరించారు. వీరితో పాటు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఆ పార్టీ ఎమ్మెల్యే అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాల కూడా విద్యార్థులకు మద్దతు పలికారు. వీసీ అప్పారావు తిరిగి విధుల్లోకి చేరిన సందర్భంగా నాలుగు రోజుల క్రితం హెచ్‌సీయూలో జరిగిన గొడవలపై కొందరు అధ్యాపకులను, విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించిన విషయం విదితమే.